ఏపీలో తాజాగా జపాన్‌లో టాయామా ప్రిఫెడ్జర్ ప్రావిన్స్ గవర్నర్ సహా 14 మంది ప్రత్యేక అధికారులు.. అక్కడి అధికార పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఏపీ ప్రభుత్వంతో పలు ఒప్పందాలు చేసుకున్నారు. జపనీస్ భాష నుంచి.. సాంకేతిక విద్య, ఔషధ రంగం, పారిశ్రామిక రంగం ఇలా.. చాలా విషయాలపైనే వారు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన తీరును అధికారులు, గవర్నర్ హాచిరో నిట్టా అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలో అమరావతి రాజధాని నిర్మాణంపై ఆసక్తి చూపించారు. ప్రధానంగా బౌద్ధునికి ఆలవాలమైన అమరావతి ప్రాంతంలో నిర్మాణాలను పరిశీలించాలని.. పూర్తయ్యాక తప్పకుండా వస్తామని కూడా చెప్పుకొచ్చారు. అదేసమయంలో విజన్-2047 డాక్యుమెంటు విషయాలు తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాలా బాగుందని ప్రశంసలు గుప్పించారు. వాస్తవానికి 2017లోనూ టాయామా ప్రిఫెడ్జర్ చంద్రబాబు హయాంలో సర్కారుతో ఒప్పందాలు చేసుకుంది.
కానీ, తర్వాత.. వైసీపీ హయాంలో ఈ ఒప్పందాలన్నీ రద్దయ్యాయి. ఇటీవల చంద్రబాబు జోక్యంతో తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు.. సాంకేతిక, ఔషధ, విద్యారంగాల్లో సహకారం అందించేందుకు.. మరోసారి ఎంవోయూ చేసుకున్నారు. ఈ క్రమంలోనే పాలనా విషయాలను అడిగి తెలుసుకున్నారు. అయితే.. విజన్ సహా.. పాలనను మెచ్చుకున్న గవర్నర్ హాచిరో నిట్టా.. సంక్షేమ పథకాల్లో కొన్నింటిపై విస్మయం వ్యక్తం చేశారు. అన్నీ ఫ్రీగా ఎలా ఇస్తున్నారని ప్రశ్నించడం గమనార్హం.
మరీ ముఖ్యంగా 67 లక్షల మందికిపైగా పింఛన్లు ఇవ్వడంతోపాటు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటివాటి అమలును తెలుసుకున్నారు. అయితే.. వీటి వల్ల.. ప్రభుత్వంపై మరింత భారం పడుతుందన్న నిట్టా.. ఇవి లేకుండా.. ఉంటే.. తమలాగే అభివృద్ది చెందడం.. పదేళ్లలో ఖాయమని వ్యాఖ్యానించారు. గతంలో తమ ప్రావిన్స్‌లోనూ ఉచితాలు ఉండేవని.. కానీ,తాము వచ్చాక.. వాటిపై నియంత్రణ పెట్టామని.. అభివృద్ది, విద్య, ఉపాధి, ఉద్యోగాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టామని.. చెప్పారు. ఆ ఒక్కటి తప్ప. అంతా బాగుందని ప్రశంసించడం గమనార్హం.
This post was last modified on December 25, 2024 12:01 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ మరణశిక్ష అమలుపై తన కఠినమైన వైఖరిని వ్యక్తం చేశారు.…
మాములుగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు వారాల తర్వాత బాగా నెమ్మదించిపోతుంది. మొదటి పది…
పెద్ద అంచనాలతో బాలీవుడ్ మూవీ బేబీ జాన్ రిలీజయ్యింది. విజయ్ బ్లాక్ బస్టర్ తెరీ రీమేక్ గా అట్లీ నిర్మాణంలో…