రిజర్వేషన్ ఉన్న రైళ్లలో ఛార్ట్ ప్రిపేరైపోయాక టికెట్లు బుక్ చేయడం సాధ్యం కాదన్న సంగతి తెలిసిందే. ఐతే ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా టికెట్లు బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అక్టోబరు 10, శనివారం నుంచి కొత్తగా పలు రైళ్లు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో రైలు స్టేషను నుంచి బయలుదేరే ఐదు నిమిషాల ముందు కూడా రైల్వే సీట్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
కరోనా సంక్షోభం నేపథ్యంలో కొన్ని నెలల పాటు రైళ్లన్నీ ఆగిపోయాయి. ఐతే అన్‌లాక్‌లో భాగంగా దశల వారీగా రైళ్లను పెంచుతోంది రైల్వే శాఖ. శనివారం నుంచి పెద్ద ఎత్తున రైళ్లను పునరుద్ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైలు బయలుదేరే సమయానికి అరగంట ముందు రెండో రిజర్వేషన్ ఛార్టు తయారు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
మామూలుగా రైలు బయలుదేరడానికి కనీసం నాలుగు గంటల ముందు ఛార్టు తయారు చేస్తారు. ఆ ఛార్టు తయారయ్యాక రైలులో సీట్లు ఖాళీగా ఉంటే రెండవ ఛార్టు తయారు చేసే వరకు పీఆర్ఎస్ కౌంటర్ల ద్వారా, ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు చెప్పారు. ఇలా రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు వరకు కూడా టికెట్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది.
ఇదిలా ఉండగా దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అక్టోబరు 15 నుంచి నవంబరు 30 వరకు 39 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. వీటిలో తెలుగు రాష్ట్రాల మధ్య కూడా కొన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఐతే కరోనాకు ముందున్న రైళ్లన్నింటినీ పునరుద్ధరించడానికి మాత్రం మరి కొన్ని నెలలు సమయం పట్టే అవకాశముంది.
This post was last modified on October 10, 2020 5:35 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…