రివెంజ్ డ్రామా కేవలం సినిమాలకే పరిమితమనుకుంటాం కానీ నిజ జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి. దానికి ఈ సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. కువైట్ నుంచి వచ్చిన ఆంజనేయ ప్రసాద్ అనే ఎన్ఆర్ఐ ఇండియాలో చదువుకుంటున్న తన కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని హత్య చేసి తిరిగి విదేశానికి వెళ్లిపోవడమే కాక నేరాన్ని ఒప్పుకుంటూ వీడియో రిలీజ్ చేయడం సంచలనం రేపుతోంది. చనిపోయిన నిందితుడి పేరు ఆంజనేయులు. వయసు 59 సంవత్సరాలు. పన్నెండేళ్ల కూతురిని చదువు కోసం ఇండియాలోనే ఉంచిన ప్రసాద్ ఆ బాధ్యతను భార్య చెల్లెలికి అప్పగించారు. ఆవిడ మామే ఈ దారుణానికి ఒడిగట్టింది.
ఇదంతా చూస్తే ఎప్పుడో 1992లో వచ్చిన సర్పయాగం గుర్తుకు వస్తుంది. కాలేజీలో చదువుతున్న కూతురి మీద కొందరు యువకులు అఘాయిత్యం చేస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. దీంతో కోర్టులో న్యాయం దొరక్క డాక్టరైన తండ్రి కిరాయి హంతకులను అద్దెకు తీసుకుని వాళ్ళను ఒక్కొక్కరిగా చంపేస్తాడు. ఇది ఒంగోలులో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా పరుచూరి బ్రదర్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది. శోభన్ బాబు నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. కట్ చేస్తే ఇప్పుడీ ఆంజనేయ ప్రసాద్ సరిగ్గా సర్పయాగం సినిమానే గుర్తు చేశాడు.
అతను చేసింది తప్పే అయినా నెటిజెన్లు మాత్రం ముమ్మాటికీ రైటేనని ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇంత ఓపెన్ గా నేరం ఒప్పుకున్నాడు కాబట్టి కువైట్ నుంచి తిరిగి ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. మనవరాలి వయసున్న మనిషి టీనేజ్ వయసు లేని పసిపాప మీద ఇలాంటి దారుణానికి ఒడిగట్టే ప్రయత్నం చేయడం ముమ్మాటికీ తీవ్ర శిక్షార్హం. అదేదో పోలీసుల వైపు నుంచి త్వరగా జరిగి ఉంటే ఆ తండ్రి కువైట్ నుంచి వచ్చి హత్య చేయాల్సి వచ్చేది కాదని బంధువుల వెర్షన్. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్టేట్ వైడ్ సెన్సేషన్ గా మారింది. దెబ్బకతన్ని హీరోగా చూస్తున్న వాళ్ళున్నారు.
This post was last modified on December 12, 2024 5:05 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…