షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. అల్లరి చేసే విద్యార్థులను మందలించటం టీచర్లు మామూలుగా చేసే పని. అలా చేయటమే ఒక టీచర్ ప్రాణాలు పోయేలా చేసింది. దీనికి ఏపీలోని అన్నమయ్య జిల్లా వేదికైంది. జిల్లాలోని రాయచోటికిలోని కొత్తపల్లి ఉర్దూ జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రవర్తన సరిగా లేని విద్యార్థులను మందలించిన టీచర్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
42 ఏళ్ల టీచర్ ఏజాష్ అహ్మద్ ఒక క్లాస్ లో పాఠాలు చెబుతున్నారు. పక్కనే ఉన్న తొమ్మిదో క్లాస్ పిల్లలు అల్లరి చేస్తున్నారు. దీంతో.. అక్కడకు వెళ్లిన ఏజాష్.. అల్లరి చేస్తున్న విద్యార్థుల్ని మందలించారు. మందలించిన విద్యార్థుల్లో ఇద్దరు కవలలు ఉన్నారు. వారిలో ఒకరు టీచర్ ఏజాష్ మీద దాడి చేశారు. దీంతో.. అతడి సోదరుడు.. మరో విద్యార్థి కూడా దాడికి పాల్పడ్డారు. విద్యార్థులు తనపై దాడి చేయటాన్ని తట్టుకోలేని టీచర్ తీవ్ర వేదనకు గురయ్యారు.
దీంతో కలుగజేసుకున్న ఇతర టీచర్లు.. దాడి చేసిన ముగ్గురు విద్యార్థుల చేత సారీ చెప్పే ప్రయత్నం చేశారు. అందుకు దాడికి గురైన అహ్మద్ సున్నితంగా తిరస్కరించారు. కాసేపటికి.. తీవ్రమైన మానసిక వేదనతో కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు నిర్దారించారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. దీనిపై ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ చేపట్టి రిపోర్టు సిద్ధం చేశారు.
అందులో దాడికి పాల్పడిన పిల్లల ప్రవర్తన సరిగా ఉండదని.. గంజాయికి అలవాటు పడి ఉన్నారన్న విషయాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. దాడి చేసిన కవలల్లో ఒకరి వద్ద కడియం ఉందని.. ఎవరైనా ఏమైనా అన్నంతనే ఆ కడియాన్ని చేతికి వేసుకొని దాడి చేస్తారని చెబుతున్నారు. టీచర్ పై దాడి సమయంలోనూ కడియాన్ని వాడారని చెబుతున్నారు. కడియం దెబ్బతో టీచర్ ఎడమ కన్ను వద్ద గాయమైనట్లుగా చెబుతున్నారు. మొత్తంగా మంచి బుద్ధులు నేర్పి.. క్రమశిక్షణ అలవాటు చేసేందుకు ప్రయత్నించిన టీచర్.. సదరు విద్యార్థుల చేతిలో దాడి.. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోవటం ఇప్పుడు సంచలనంగా మారింది.
This post was last modified on December 6, 2024 11:59 am
నిన్న క్రిష్ 4 ప్రకటన వచ్చింది. రాకేష్ రోషన్, ఆదిత్య చోప్రాలు సంయుక్త నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. కొద్దిరోజుల క్రితం బడ్జెట్…
తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు జరిగాయి. టీడీపీ…
ఎంత మంచి సినిమా తీసినా అపోజిషన్ వల్ల ప్రతిసారి వసూళ్లు ప్రభావితం చెందుతున్నాయనే ఆందోళన నిర్మాత నాగవంశీలో పలు సందర్భాల్లో…
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఆయనపై ఇప్పటికి మూడు కేసులు నమో దయ్యాయి.…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే సినిమా ఓపెనింగ్ ఉగాది రోజు జరగనుంది. విక్టరీ వెంకటేష్ ముఖ్య…
తెలుగు దేశం పార్టీ... భారత రాజకీయాల్లో ఓ సంచలనం. తెలుగు నేల రాజకీయాల్లో ఓ మార్పు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో…