ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. గెలుపునకు దగ్గరయ్యేందుకు తనకున్న అన్ని ప్రయత్నాల్ని చేస్తున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికన్లకే అగ్ర తాంబూలం అంటూ.. సెంటిమెంట్ ను రగల్చటం ద్వారా అధికారాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్న ఆయన.. తాజాగా ఉపాధి ఆధారిత హెచ్ 1 బీ వీసాల జారీ అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం హెచ్ 1బీ వీసాల జారీపై ప్రభావం చూపటమే కాదు.. డాలర్ డ్రీమ్స్ మీద ఆశలు పెట్టుకున్న వారి కలల్ని భగ్నం చేస్తుందన్న మాట వినిపిస్తోంది.
దేశంలోకి చట్టబద్ధమైన వలసల్ని అరికట్టటం.. స్థానికీకరణ.. అమెరికా ఉద్యోగాల్ని రక్షించే లక్ష్యంతోనే తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ట్రంప్ సర్కారు విడుదల చేసిన మధ్యంతర ఉత్తర్వులతో ఉపాధి కోసం వచ్చే వారి మీద ప్రభావం పడనుంది.
యుఎస్ పౌరసత్వం.. ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కు సంబంధించి చర్యలు తీసుకున్నట్లుగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్ 1 బీ వీసాకు సంబంధించి గడిచిన ఇరవైఏళ్లలో చేసిన అతి ముఖ్యమైన సంస్కరణలో తాజా ఉత్తర్వు ఉంటుందని చెబుతున్నారు. ఈ నిర్ణయంతో వీసాల కోసం దరఖాస్తు చేసే మూడొంతుల మందిలో ఒక వంతు వారిని ప్రభావితం చేసే వీలుందంటున్నారు.
ఇంతకీ తాజా ఉత్తర్వుల్లోని కీలకమైన అంశాలు ఏమున్నాయన్నది చూస్తే.. మొదటిది.. స్పెషాల్టీ నిర్వచనాన్ని తగ్గించటం.. అమెరికన్ల స్థానంలో ఇతర ఐటీ నిపుణులు అవసరమని నిరూపించేందుకు మరిన్ని డాక్యుమెంట్లు అవసరమవుతాయి. అంతేకాదు.. ఐటీ నిపుణుల నియామకం కోసం ఆధారపడే థర్డ్ పార్టీల మీద మరింత డేగ కన్ను వేస్తారు.
తాజా ఉత్తర్వుల ప్రకారం హెచ్ 1బీ వీసా ఉద్యోగాలను కనీస వేతన స్థాయిల్ని కూడా మార్చే వీలుంది. ఇది.. భారతీయ టెక్ నిపుణులు.. టెక్ సంస్థల్ని భారీగా ప్రభావితం చేస్తుందంటున్నారు. తాజా ఉత్తర్వుల మీద పలు సంస్థలు కోర్టును ఆశ్రయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 7, 2020 2:27 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…