భారత ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘం పనితీరుపై ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్ సహా.. పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప్ప ఎన్ని కలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఒకే రోజు(శనివారం)లో పూర్తయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కోట్ చేస్తూ.. మస్క్ నివ్వెర పోయారు. అదే సమయంలో ప్రశంసించారు కూడా.
రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపును ఒకే రోజులో పూర్తి చేయడం గ్రేట్ అని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ సమయంలోనే అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రస్తావించారు. ఇప్పటికీ అమెరికాలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. కాలిఫోర్నియాలో ఇప్పటికీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతూనే ఉందన్నారు. అమెరికాతో పోల్చుకుంటే.. భారత్ గ్రేట్ అని వ్యాఖ్యానించారు.
“భారత్‌లో 6.4 కోట్ల మంది వేసిన ఓట్లను ఒక్క రోజులోనే లెక్కించేశారు. కాలిఫోర్నియాలో ఇప్పటికీ లెక్కింపు జరుగుతూనే ఉంది“ అని ఎక్స్‌లో మస్క్ రాసుకొచ్చారు. దీనికి భారత ఎన్నికల ఓట్ల లెక్కింపుపై వచ్చిన ఓ ఆర్టికల్‌ను(640 మిలియన్ల ఓట్లను భారత్ ఒక్క రోజులో ఎలా లెక్కించింది) కూడా జత చేశారు. ఈ పోస్టుకు మరో క్యాప్షన్ కూడా జోడించారు. ఈ పోస్ట్‌కి “అయితే భారతదేశంలో, మోసం చేయడం వారి ఎన్నికల ప్రధాన లక్ష్యం కాదు” అని శీర్షిక పెట్టారు.
మరోపోస్టుకు కూడా మస్క్ స్పందించారు. “భారత్ 640 మిలియన్ల ఓట్లను ఒకే ఒక్క రోజులో లెక్కిస్తే.. కాలిఫోర్నియాలో 1.5 కోట్ల ఓట్లను గత 18 రోజులుగా లెక్కిస్తూనే ఉన్నారు“ అని కామెంట్ చేశారు. ఇప్పటికి రెండు వారాలు పూర్తయినా 3 లక్షల ఓట్లను ఇంకా లెక్కించాల్సి ఉంది. ఇక్కడ బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఓట్లు వేశారు.
This post was last modified on November 24, 2024 2:34 pm
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…