లాక్ డౌన్ టైంలో ఉపాధి లేక, ఆదాయం కోల్పోయి అవస్థలు పడుతున్న ఈఎంఐ జీవులకు ఊరటనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మారటోరియం అవకాశాన్ని ఇచ్చినట్లే ఇచ్చి అందులో పెట్టిన మెలిక తీవ్ర నిరాశకు గురి చేసింది. మారటోరియం తీసుకుని వాయిదే వేసుకున్న ఈఎంఐల మొత్తాన్ని అసలులో కలిపి దానికి మళ్లీ వడ్డీ వేయడం వల్ల చివర్లో ఈఎంఐలు మరిన్ని యాడ్ అవుతాయన్న సమాచారం ఎవరికీ రుచించలేదు. కానీ విధి లేక కొందరు మారటోరియం తీసుకున్నారు. కొందరు ఎలాగోలా కష్టపడి ఈఎంఐలు కట్టారు.
ఐతే దీనిపై దాఖలపై పిటిషన్లపై విచారణ జరిపిన కేంద్ర ప్రభుత్వం ఈ మెలికను తప్పుబట్టింది. వడ్డీ మీద మళ్లీ వడ్డీ వేసి ఈఎంఐలు పెంచడాన్ని తప్పుబట్టింది. దీనిపై కొన్ని నెలలుగా విచారణ సాగుతోంది. ఐతే చివరికి రూ.2 కోట్ల లోపు రుణాలకు ఈ వడ్డీ మాఫీ చేయడానికి కేంద్రం అంగీకరించడం తెలిసిన సంగతే.
ఐతే లాక్ డౌన్ టైంలో ఎలాగోలా కష్టపడి ఈఎంఐలు కట్టిన వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తింది. మారటోరియం తీసుకున్న వాళ్లకు మాత్రమే ప్రయోజనం కల్పిస్తే వీరికి అన్యాయం జరిగినట్లే అవుతుంది. ఐతే వారికి కూడా ఉపశమనాన్నందించేలా కేంద్రం ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మారటోరియం కట్టని వాళ్లకు వడ్డీ మాఫీతో ఎంత ఉపశమనం ఇస్తున్నారో అదే స్థాయిలో ఈఎంఐలు కట్టిన వాళ్లకు క్యాష్ బ్యాక్ ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఆ క్యాష్ బ్యాక్ ఎంత వస్తే అంత మొత్తం ఈఎంఐలు కట్టిన రుణ గ్రహీతల ప్రిన్సిపల్ అమౌంట్లో తగ్గిస్తారట.
ఐతే ఈ లెక్కలు కట్టడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే. బ్యాంకులు ఇందుకోసం ఒక సాఫ్ట్ వేర్ అందుబాటులోకి తేవాల్సి ఉంటుందట. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ అని, ఇదంతా పూర్తవడానికి చాలా సమయం పడుతుందని.. వచ్చే ఏడాది కానీ ఈ క్యాష్ బ్యాక్ రుణ గ్రహీతల లోన్ అకౌంట్లలోకి రావడం కష్టమని అంటున్నారు.
This post was last modified on October 5, 2020 8:35 pm
దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని..…
అతడులో తనికెళ్ళ భరణి చెప్పే ఫేమస్ డైలాగు ఒకటుంది. బ్రహ్మాజీతో మాట్లాడుతూ ఇన్ని బళ్ళు ఎందుకురా బుజ్జి అంటాడు. బాలీవుడ్…
ఇప్పటి మన జీవిత విధానం చాలా వేగంగా మారిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే కేవలం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కొన్ని…
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…