Trends

భారత్ వెళ్లదు, పాక్ కాంప్రమైజ్ కాదు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు గెలుస్తారు అనే దాని కంటే కూడా, అసలు భారత్ ఈ మ్యాచ్ టోర్నీలో పాల్గొంటుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. భద్రతా కారణాల వల్ల పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌ నిరాకరించడంతో, ఈ పరిణామం ఛాంపియన్స్ ట్రోఫీ జరగడంపై సందిగ్ధతకు దారితీస్తోంది. ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్‌ వెళ్లబోదని బీసీసీఐ ఇదివరకే స్పష్టంగా చెప్పింది. అయితే సజావుగా టోర్నమెంట్ సాగేందుకు ఒక మంచి సలహా కూడా ఇచ్చింది.

బీసీసీఐ ప్రతిపాదన ప్రకారం హైబ్రిడ్ మోడల్ విధానంలో తమ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని సూచించింది. అయితే ఈ విషయాన్ని ఐసీసీ ఇప్పటికే పీసీబీకి తెలియజేసింది. కానీ, పీసీబీ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఈ వివాదం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ మోడల్ విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. మధ్యలో పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ కండిషన్ ముందు తగ్గకూడదు అన్నట్లు మొండి పట్టుతో ససేమిరా అంటోంది.

పీసీబీకి తమ దేశంలోనే అన్ని మ్యాచ్‌లను నిర్వహించాలంటూ కఠినమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ కూడా దేశం వెలుపల ఒక్క మ్యాచ్ కూడా జరగకూడదని నిర్ణయించింది. “మా దేశం నుంచి ఒక్క మ్యాచ్‌ కూడా తరలించకూడదని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది,” అని పీసీబీ అధికారి వెల్లడించారు.

ఈ వివాదంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తన యూట్యూబ్ వీడియోలో కూడా హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించకూడదని పీసీబీపై ప్రభుత్వం కట్టడి చేస్తోందని తెలిపారు. ఒకవేళ పీసీబీ హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించకపోతే, ఐసీసీ టోర్నమెంట్‌ను దక్షిణాఫ్రికాకు తరలించే అవకాశం కూడా ఉందని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఐసీసీ, భారత్, పాకిస్థాన్‌ల మధ్య సవాళ్లు కొనసాగుతుండగా, ప్రపంచ క్రికెట్‌కు ఎదురవుతున్న ఈ సంక్షోభానికి ఎలాంటి పరిష్కారం దొరకుతుందో చూడాలి.

This post was last modified on November 13, 2024 6:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

38 శాతం ఓట్ షేర్ కూడా పోయేలా ఉంది జగన్!

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…

4 hours ago

నా తల్లిని అవమానిస్తే ఊరుకోవాలా?..లోకేష్ ఫైర్

మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…

4 hours ago

రఘురామతో రాజీకి వచ్చిన సాయిరెడ్డి

వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…

6 hours ago

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న శ్రీరెడ్డి

వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…

7 hours ago

ఏపీకి రాందేవ్‌-ర‌విశంక‌ర్‌: బాబుకు మంచి సిగ్న‌ల్స్ ..!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవ‌లం ఐదు మాసాలు మాత్ర‌మే పూర్త‌యింది. కానీ,…

9 hours ago

ఆమిర్‌తో పైడిప‌ల్లి.. సాధ్య‌మేనా?

వంశీ పైడిప‌ల్లికి యావ‌రేజ్ డైరెక్ట‌ర్ అని పేరుంది. అత‌ను గొప్ప సినిమాలేమీ తీయ‌లేదు. కానీ.. అత‌ను కెరీర్లో ఇప్ప‌టిదాకా పెద్ద…

10 hours ago