కరోనా కేసులు, మరణాల లెక్కల్ని చాలా తేలిగ్గా తీసుకునే పరిస్థితికి వచ్చేశాం. ఒకప్పుడు ఎక్కడో వీధి చివర ఒక కరోనా కేసు ఉందంటేనే వణికిపోయేవాళ్లం. కానీ ఇప్పుడు ఎదురింట్లో కరోనా పేషెంట్ ఉన్నా మామూలుగానే ఉంటున్నాం. మన ఇంట్లో వాళ్లకు కరోనా వస్తే తప్ప భయపడట్లేదు. బయట ఎలా పడితే అలా స్వేచ్ఛగా తిరిగేస్తున్నాం. అన్ని పనులూ యధావిధిగా చేసుకుపోతున్నాం.
ఐతే జనాలు లైట్ తీసుకుని ఉండొచ్చు కానీ.. దేశంలో కరోనా విలయం మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇండియాలో కరోనా మహమ్మారి ఒక దిగ్భ్రాంతికర మైలురాయిని అందుకుంది. మన దేశంలో ఇప్పటిదాకా కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య లక్షకు చేరుకుంది. శుక్రవారం లేట్ నైట్ ఈ లక్షవ కరోనా మరణం నమోదైంది ఇండియా.
ప్రపంచవ్యాప్తంగా లక్ష కరోనా మరణాల మార్కును అందుకున్న మూడో దేశం ఇండియా. అమెరికాలో ఈ మహమ్మారి వల్ల ఇప్పటిదాకా 2.08 లక్షల మంది చనిపోగా.. బ్రెజిల్‌లో కరోనా మరణాల సంఖ్య 1.45 లక్షలుగా ఉంది. శుక్రవారం కూడా ఇండియాలో వెయ్యి మందికి పైగానే చనిపోయారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 64 లక్షల దాకా ఉండగా.. శుక్రవారం 81 వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి.
మొత్తం లక్ష మరణాల్లో మూడో వంతుకు పైగా, అంటే 37 వేల పైచిలుకు చనిపోయింది ఒక్క మహారాష్ట్రలోనే. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటిదాకా 7 లక్షల కేసులు నమోదవగా.. 5870 మంది దాకా మరణించారు. తెలంగాణలో కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువలో ఉండగా.. మరణాల సంఖ్య 1,145. ఇండియాలో ఇప్పటిదాకా 53.5 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. 9 లక్షల దాకా యాక్టివ్ కేసులున్నాయి. ఒక దశలో రోజువారీ కేసులు లక్ష మార్కుకు చేరువగా వెళ్లగా.. ఆ తర్వాత కొంచెం తగ్గి 80 వేలకు అటు ఇటుగా కేసులు నమోదవుతున్నాయి.
This post was last modified on October 3, 2020 12:27 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…