Trends

రైనాకు చెన్నై శాశ్వ‌తంగా టాటా చెప్పేసిందా?

ఈసారి ఐపీఎల్ ముంగిట భార‌త సీనియ‌ర్ క్రికెట‌ర్‌ సురేష్ రైనా వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి కొన్ని రోజుల్లో లీగ్ మొద‌ల‌వుతుండ‌గా.. ఉన్న‌ట్లుండి యూఏఈ నుంచి ఇంటిముఖం ప‌ట్టాడ‌త‌ను. చెన్నై సూప‌ర్ కింగ్స్ కీక‌ల ఆట‌గాళ్ల‌లో ఒక‌డైన అత‌ను.. ఇలా ఉన్న‌ట్లుండి టోర్నీకి దూరం కావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

అత‌డి నిష్క్ర‌మ‌ణ‌కు ర‌క‌ర‌కాల కార‌ణాలు వినిపించాయి. కొంద‌రేమో క‌రోనాకు భ‌య‌ప‌డి రైనా వ‌చ్చేశాడ‌న్నారు. ఇంకొంద‌రేమో త‌న మేన‌త్త ఇంట్లో దోపిడీ దొంగ‌లు సృష్టించిన భీభ‌త్సం తాలూకు విషాదం వ‌ల్ల ఐపీఎల్ నుంచి త‌ప్పుకున్నాడ‌న్నారు. అలాగే చెన్నై యాజ‌మాన్యం తీరు న‌చ్చ‌క‌, త‌న‌కు దుబాయ్‌లో స‌రైన గౌర‌వం ద‌క్క‌లేద‌ని రైనా అలిగి ఇంటికొచ్చేశాడ‌న్నారు.

ఇందులో ఏది నిజ‌మో తెలియ‌దు. ఐతే తొలి మ్యాచ్ గెలిచిన త‌ర్వాత చెన్నై జ‌ట్టు బాగా ఇబ్బంది ప‌డ్డ నేప‌థ్యంలో సురేష్ రైనా మ‌ళ్లీ జ‌ట్టుతో క‌లిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం చెన్నై అభిమానుల్లో క‌లిగింది. ఇంత‌కుముందు ఏం జ‌రిగిందో ఏమో.. రైనా తిరిగి లీగ్‌కు వ‌స్తాడా అని చెన్నై జ‌ట్టు సీఈవో విశ్వ‌నాథ‌న్‌ను మీడియా వాళ్లు అడిగితే అందుకు ఛాన్సే లేద‌న్నాడు.

రైనా గురించి తాము అస్సలు ఆలోచించ‌ట్లేద‌న్నాడు. ఇంటికైతే వ‌చ్చేశాడు కానీ.. రైనా ట్వీట్లు అవీ చూస్తే అత‌డి మ‌నసంతా చెన్నై జ‌ట్టుతోనే ఉందేమో అనిపించింది. కానీ అటువైపు చెన్నై జ‌ట్టు యాజ‌మాన్యం నుంచి మాత్రం అలాంటి స్పంద‌న క‌ర‌వైంది. పైగా జ‌ట్టు వెబ్ సైట్ నుంచి రైనాతో పాటు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో టోర్నీ నుంచి త‌ప్పుకున్న హ‌ర్భ‌జ‌న్ పేరును కూడా తొల‌గించారు.

టోర్నీ నుంచి ఏదైనా కార‌ణాలతో త‌ప్పుకున్న ఆట‌గాళ్ల పేర్ల‌ను జ‌ట్ల వెబ్ సైట్ల‌లో విత్‌డ్రాన్ ప్లేయ‌ర్లుగా పేర్కొంటుంటారు. ఇలా పూర్తిగా తొల‌గించేయ‌రు. దీంతో ఈ ప‌రిణామం సందేహాల‌కు తావిచ్చింది. తాజా స‌మాచారం ప్ర‌కారం రైనా, హ‌ర్భ‌జ‌న్‌ల‌తో చెన్నై జ‌ట్టు శాశ్వ‌తంగా బంధం తెంచుకుంటోంద‌ని.. వారితో ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకునే ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్టింద‌ని.. వీళ్లిద్ద‌రూ 2021 ఐపీఎల్‌లోనూ ఆ జ‌ట్టుకు ఆడ‌ర‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే మాత్రం చెన్నై జ‌ట్టులో రైనాను అంత‌ర్భాగంగా భావించే అభిమానులు తీవ్ర నిరాశ‌కు గురి కావ‌డం ఖాయం.

This post was last modified on October 3, 2020 8:26 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

22 minutes ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

59 minutes ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

1 hour ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

2 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

2 hours ago