ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన రష్యా కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించిన మరో ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రయోగ ఫలితాల్ని పరిమిత స్థాయిలో పూర్తి చేసి.. తన వ్యాక్సిన్ గురించి ప్రపంచానికి గొప్పలు చెబుతున్న రష్యా.. తాజాగా తన వ్యాక్సిన్ (స్పుత్నిక్)ను మాస్కో మహానగరంలోని సాధారణ ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. ఈ వ్యాక్సిన్ కోసం భారత్ ను రష్యా కోరుతున్న రెండు కోరికలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తాము తయారు చేసిన వ్యాక్సిన్ ప్రొడక్షన్ తో పాటు.. మూడో దశ ట్రయల్స్ ను భారత్ లో చేపడతామని ఆ దేశం భారత సర్కారును కోరుతోంది. మూడో దశ ప్రయోగాలు చాలా పరిమితంగా చేసిన నేపథ్యంలో.. ఆ వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందన్న క్లినికల్ టెస్టులు భారత్ లో నిర్వహించాలని రష్యా భావిస్తోంది.
దీంతో.. క్లీనికల్ పరీక్షలు భారత్ లో చేసేందుకు వీలుగా కేంద్రాన్ని కోరింది రష్యా. ఆ దేశ విన్నపాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ చురుగ్గా పరిశీలిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకునే వీలుంది.
అంతేకాదు.. తాము రూపొందించిన వ్యాక్సిన్ తయారీని సైతం భారత్ లోనే చేపట్టాలని రష్యా భావిస్తోంది. రష్యా ప్రయత్నాలకు సానుకూలంగా దేశీయ ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వ్యాక్సిన్ ప్రొడక్షన్ లో భారత్ కున్న అవకాశాలు ఏ స్థాయి అన్న విషయం రష్యా తాజా రిక్వెస్టును చూస్తే ఇట్టే అర్థమైపోతుందని చెప్పాలి.
This post was last modified on September 9, 2020 10:15 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…