అంతర్జాతీయ క్రికెట్‌ను మించిన ఇంటెన్సిటీ ఉండే టోర్నీ ఐపీఎల్. దీనికున్న ఆదరణ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. విపరీతమైన పోటీ తత్వం ఉండే ఈ లీగ్‌లో ఒక జట్టుకు కెప్టెన్సీ చేయడం సవాలుతో కూడుకున్న విషయమే. టీ20 క్రికెట్లో కెప్టెన్సీకి పెద్దగా విలుండదని అనుకుంటారు కానీ.. ఆ విషయం తప్పని ఎన్నోసార్లు రుజువైంది. కెప్టెన్లను మార్చడం వల్ల జట్ల రాతలు మారిపోయాయి ఈ లీగ్‌లో.
కొన్ని జట్లు బలంగా కనిపించినప్పటికీ.. సరైన కెప్టెన్ లేక దెబ్బ తింటే.. మరికొన్ని జట్లు బలహీనంగా ఉండి కూడా మంచి కెప్టెన్ ఉండటం వల్ల మెరుగైన ప్రదర్శన చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే.. గంగూలీ సారథ్యంలో తొలి మూడు సీజన్లలో ఆ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. గంగూలీ మేటి కెప్టెనే కానీ.. టీ20 క్రికెట్లో మాత్రం అతను విఫలమయ్యాడు. అతణ్ని తప్పించి గంభీర్‌ను కెప్టెన్‌ను చేశాక ఆ జట్టు రాత మారింది. రెండో సీజన్లలోనే జట్టుకు టైటిల్ అందించాడతను.
ఆ తర్వాత మరోసారి కోల్‌కతాను గెలిపించాడు గంభీర్. ఐతే ఆ తర్వాత అతడి వ్యక్తిగత ప్రదర్శన పడిపోవడంతో జట్టుకు దూరం అయ్యాడు. గంభీర్ స్థానంలో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఐతే అతడి సారథ్యంలో కోల్‌కతా వైఫల్యమే చవిచూసింది. కనీసం వ్యక్తిగత ప్రదర్శన అయినా బాగుంటే అతణ్ని కెప్టెన్‌గా కొనసాగించడంలో అర్థం ఉంది. కానీ గత సీజన్లో అతను పెద్దగా ఆడిందేమీ లేదు. ఈ సీజన్లో అయితే మరీ ఘోరమైన ప్రదర్శన చేస్తున్నాడు. 30, 0, 1, 6.. ఇవీ ఈ ఏడాది లీగ్‌లో ఆడిన నాలుగు ఇన్నింగ్సుల్లో కార్తీక్ స్కోర్లు. కెప్టెన్‌గా కూడా అతడి పనితనం ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు.
బ్యాటింగ్ ఆర్డర్లో మోర్గాన్, రసెల్‌లను కాదని అతను ముందు వస్తుండటాన్ని అందరూ తప్పుబడుతున్నారు. అలా వచ్చి అతను సాధిస్తున్నది ఏమీ లేదు. శనివారం ఢిల్లీతో మ్యాచ్‌లో కార్తీక్ కాకుండా మోర్గాన్ ముందు వస్తే కథే వేరుగా ఉండేదని ఇద్దరి ఆటను పరిశీలిస్తే అర్థమవుతోంది. కెప్టెన్‌గా కూడా మోర్గాన్ సమర్థుడన్న అభిప్రాయం బలపడుతోంది. ఇటు విశ్లేషకులు, అటు అభిమానుల నుంచి కార్తీక్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. అతణ్ని ఐపీఎల్ చరిత్రలోనే వరస్ట్ కెప్టెన్‌గా అభివర్ణిస్తున్నారు. కోల్‌కతా అభిమానులే కార్తీక్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ మోర్గాన్‌కు కెప్టెన్సీ అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on October 4, 2020 6:50 pm
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…