పవన్ కల్యాణ్ పక్కా టీడీపీ అవుతాడా..?!

పవన్ కల్యాణ్ పక్కా టీడీపీ అవుతాడా..?!

ఉందో లేదో తెలీని 'జనసేన' కు అధినేతగా ఉన్నాడు పవన్ కల్యాణ్. ఏ రాజకీయ పార్టీకి అయినా.. ఒక స్ట్రక్చర్ ఉంటుంది.. కార్యవర్గం, నేతలు, కార్యకర్తలు ఉంటారు. అయితే పవన్ పార్టీకి మాత్రమే పవనే సుప్రిమో. అంతకు మించి ఈ పార్టీకి ఎలాంటి స్ట్రక్చరూ లేదు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం వారు తమ పార్టీ సమావేశాలకు జనసేన అధినేతను ఆహ్వానించారు. మహానాడులో పాల్గొనాల్సిందిగా కోరారు!

ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడం.. తెలుగుదేశం అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారం చేయడం.. ఎన్నికల తర్వాత కూడా బాబును సమర్థించడం.. రాజధాని తదితర అంశాల్లో కూడా బాబుకు అనుకూలంగానే మాట్లాడుతుండటంతో.. పవన్ తో తెలుగుదేశం పార్టీ సన్నిహితంగా మెలుగుతోంది.  ఈ నేపథ్యంలో ఆ పార్టీ మహానాడుకు పవన్ ను ఆహ్వానించింది.

ఈ నెల 27 వ తేదీన ఉంచి 29 వ వరకూ విజయవాడలో జరిగే తమ పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలని.. వీలునప్పుడు హాజరు కావాలని తెలుగుదేశం నేతలు పవన్ ను ఆహ్వానించారు. మరి ఈ ఆహ్వానాన్ని పవన్ మన్నిస్తాడా?! తెలుగుదేశం పార్టీ అధికారిక సమావేశాలకు హాజరవుతాడా? అనేది సందేహమే. ఒకవేళ ఈ సమావేశాలకు హాజరయితే..పవన్ పక్కా టీడీపీ మనిషి అనే పేరు  తెచ్చుకొన్నట్టే అవుతుంది. దానికి జనసేన అధినేత సిద్ధంగా ఉన్నాడా?! మరి!

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు