సంక్రాంతి మత్తు నుంచి బయటికొస్తారా?

సంక్రాంతి మత్తు నుంచి బయటికొస్తారా?

సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల కడుపు నిండిపోయిందీసారి. పండుగ కానుకలుగా రిలీజైన రెండు భారీ చిత్రాలూ ప్రేక్షకుల్ని అలరించాయి. కంటెంట్ పరంగా హెచ్చుతగ్గులన్నిప్పటికీ.. వసూళ్లలోనూ తేడా ఉన్నప్పటికీ రెంటికీ భారీ వసూళ్లు వచ్చినట్లే. ‘అల వైకుంఠపురములో’ పాజిటివ్ టాక్‌ను ఉపయోగించుకుని అనూహ్యమైన వసూళ్లు సాధించి నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్‌గా కూడా నిలిచింది.

ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ వీక్ కంటెంట్‌తోనే బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకుంది. ప్రేక్షకులు ఈ రెండు సినిమాలతో బాగా సంతృప్తి చెందడం వల్లో లేదంటే వాటి కోసం బాగా ఖర్చు పెట్టేయడం వల్లో కానీ.. తర్వాత వచ్చిన సినిమాల్ని పెద్దగా పట్టించుకోలేదు. గత నెల రోజుల్లో విడుదలైన ఈ సినిమా సంతృప్తికర ఫలితాన్నందుకోలేదు.

సంక్రాంతి సినిమాల తర్వాత వచ్చిన తొలి చిత్రం ‘డిస్కో రాజా’ పెద్ద డిజాస్టరే అయింది. సంక్రాంతి హ్యాంగోవర్ నుంచి బయటికి రాని ప్రేక్షకులు ఆ సినిమాను అసలు పట్టించుకోనే లేదు. తర్వాతి వారం వచ్చిన ‘అశ్వథ్థామ’ వీకెండ్ వరకు జోరు చూపించి ఆ తర్వాత చల్లబడిపోయింది. ఆపై వారం వచ్చిన ‘జాను’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు చప్పుడే లేకపోయింది బాక్సాఫీస్ దగ్గర. ఆ మూవీ ఒక పెద్ద డిజాస్టర్.

ఇక గత వారం రిలీజైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ను విజయ్ దేవరకొండ క్రేజ్ కూడా కాపాడలేకపోయింది. వీకెండ్లోనే స్ట్రగులైన ఆ చిత్రం.. తర్వాత సోదిలో లేకుండా పోయింది. మొత్తంగా సంక్రాంతి అనంతరం నాలుగు వారాలూ బాక్సాఫీస్‌లో హుషారు లేకపోయింది. ఇంకా జనాలు సంక్రాంతి సినిమా ‘అల వైకుంఠపురములో’నే ప్రిఫర్ చేస్తూ దానికే వసూళ్లు ఇస్తున్నారు. ఐతే ఈ వారం వస్తున్న ‘భీష్మ’తో అయినా జనాల దృష్టి మళ్లుతుందా.. సంక్రాంతి మత్తు బయటికొచ్చి కొత్త సినిమాకు పట్టం కడతారా.. కొత్త ఏడాదిలో నాన్-సంక్రాంతి హిట్ ఇస్తారా అన్నది చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English