అజ్నాత‌వాసి రికార్డును సాహో బ‌ద్ద‌లు కొడుతుందా?

అజ్నాత‌వాసి రికార్డును సాహో బ‌ద్ద‌లు కొడుతుందా?

ఇప్ప‌టిదాకా సాహో వ‌సూళ్ల రికార్డుల గురించి చాలా ముచ్చ‌ట్లు విన్నాం. తొలి రోజు.. తొలి వారాంతం.. తొలి వారం రోజుల్లో ఈ సినిమా అనేక రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది. బాహుబ‌లితో పాటు నాన్-బాహుబ‌లి రికార్డులు కూడా నెల‌కొల్పింది. ఇప్పుడిక సాహో కొత్త రికార్డుల గురించి మాట్లాడుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింది.

అవి పాజిటివ్ రికార్డులు కావు. నెగెటివ్ రికార్డులు. తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే బ‌య్య‌ర్ల‌కు అత్య‌ధిక న‌ష్టాలు తెచ్చిన సినిమాగా సాహో రికార్డుల్లోకి ఎక్క‌డం లాంఛ‌న‌మే అని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం. సాహో చిత్రాన్ని బ‌య్య‌ర్ల‌కు రూ.290 కోట్ల‌కు అమ్మారు. కానీ ఈ సినిమా ఇంకా రూ.200 కోట్ల షేర్ మార్కును కూడా అందుకోలేదు.

ఆదివారం షోల‌న్నీ అయ్యేస‌రికి వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ రూ.200 కోట్ల‌కు అటు ఇటుగా ఉండొచ్చేమో. కానీ సోమ‌వారం నుంచి సినిమా నెగెటివ్ షేర్ మోడ్‌లోకి వెళ్లే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అంటే ఇక‌పై సినిమాను థియేట‌ర్ల‌లో న‌డిపిస్తే మెయింటైనెన్స్ ఖ‌ర్చులు కూడా వెన‌క్కి వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఉత్త‌రాదిన హిందీ వెర్ష‌న్ మిన‌హాయిస్తే అన్నిచోట్లా ఇదే ప‌రిస్థితి.

ఆంధ్రాలో తొలి వారంలోనే కొన్ని చోట్ల ఈ ప‌రిస్థితి నెల‌కొంది. వీకెండ్లో కాస్త పుంజుకుని ఓ మోస్త‌రుగా వ‌సూళ్లు సాధించింది. కానీ రేప‌ట్నుంచి మాత్రం సినిమాకు గ‌డ్డు ప‌రిస్థితులు ఎదురుకావ‌డం ఖాయం. ఇక దాదాపుగా సినిమా థియేట్రిక‌ల్ ర‌న్ ముగింపు ద‌శ‌కు చేరుకున్న‌ట్లే. క‌నీసం రూ.80 కోట్ల దాకా సాహో న‌ష్టం తెచ్చిపెట్టే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. అజ్నాత‌వాసి పేరిట ఉన్న రూ.60 కోట్ల న‌ష్టం రికార్డును సాహో బ‌ద్ద‌లు కొట్ట‌డం లాంఛ‌న‌మే కావ‌చ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English