జ‌గ‌న్ త‌లుచుకుంటే రూ.5వేల కోట్లు ఏపీ ఖ‌జానాకు!

జ‌గ‌న్ త‌లుచుకుంటే రూ.5వేల కోట్లు ఏపీ ఖ‌జానాకు!

ఏపీ ఖ‌జానా ఖాళీగా ఉంది. రోజు వ్య‌వ‌ధిలో జీతాలు ఇవ్వాల్సిన వేళ‌.. ఖాళీ బొక్క‌సం దృష్ట్యా ఓవ‌ర్ డ్రాఫ్ట్ కు వెళ్లి స‌మ‌స్య‌ను తాత్కాలికంగా స‌మిసిపోయేలా చేయొచ్చు. కానీ.. బాబుగారి ఐదేళ్ల పాల‌న పుణ్య‌మా అని.. ఏపీ అప్పు ఇప్పుడు భారీగా పెర‌గ‌ట‌మే కాదు.. పెద్ద ఎత్తున ఆర్థిక లోటు ఇబ్బంది పెట్టే ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. ఏపీకి ఆర్థిక ద‌న్ను ఇప్పుడు చాలా అవ‌స‌రం.

కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు భారీగానే పెండింగ్ లో ఉన్నా.. అవ‌న్నీ వ‌స్తాయ‌ని ఆశ ప‌డితే అత్యాశే అవుతుంది. తియ్య‌టి మాట‌లు చెప్పే మోడీ.. ఏపీకే కాదు.. ఏ రాష్ట్రానికి కూడా స్నేహ‌పూర్వ‌కంగా సాయం చేస్తార‌ని భావిస్తే త‌ప్పులో కాలేసిన‌ట్లే. త‌న‌కున్న ప్రాధామ్యాయాల‌కు త‌గ్గ‌ట్లు మోడీ వ్య‌వ‌హ‌రిస్తారే త‌ప్పించి.. ఒక రాష్ట్రం కోసం ఆయ‌న నిధులు ఇవ్వ‌టం అంతే తేలికైన విష‌యం కాదు.

అందుకే.. ఢిల్లీ నుంచి వ‌చ్చే నిధుల మీద ఆశ పడితే అంత‌కు మించిన మిస్టేక్ మ‌రొక‌టి ఉండ‌దు. రాష్ట్రం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ త‌లుచుకుంటే.. రూ.5వేల కోట్ల నిధులు ఏపీకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఎలా అంటారా?  ఏపీ ప్ర‌భుత్వానికి విద్యుత్ బ‌కాయిల కింద రూ.5వేల కోట్ల మొత్తం బాకీ ఉంది. ఈ మొత్తాన్ని గ‌త ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించినా.. ఇరు ప్ర‌భుత్వాల మ‌ధ్య ఉన్న పంచాయితీతో ఈ వ్య‌వ‌హారం ఒక కొలిక్కి రాలేదు.

విద్యుత్ బ‌కాయిల‌కు సంబంధించిన అస‌లు నిజం తెలంగాణ ప్ర‌భుత్వానికి కూడా తెలుసు. అయితే.. ఉత్త పుణ్యానికే రూ.5వేల కోట్లు.. అది కూడా చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ఇచ్చే అవ‌కాశం ఉండ‌దు. ఇప్పుడున్న నిధుల అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి దృష్ట్యా.. అడిగే రీతిలో కేసీఆర్ ను అడిగితే.. ఆయ‌న మొత్తం కాకుండా వాయిదాల ప‌ద్ధ‌తిలో ఈ మొత్తాన్ని ఇచ్చే వీలుంది. అవ‌స‌ర‌మైతే.. అవుటాఫ్ బాక్స్ లో ప్ర‌య‌త్నిస్తే.. తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి ఏపీకి రావాల్సిన రూ.5వేల కోట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. కాకుంటే.. జ‌గ‌న్ మ‌న‌స్ఫూర్తిగా ప్ర‌య‌త్నిస్తే.. ఈ భారీ మొత్తం ఏపీ ఖ‌జ‌నాకు చేరుతుంది. అదే జ‌రిగితే.. ఇప్పుడున్న ఆర్థిక క‌ష్టాల  ఉక్కిరిబిక్కిరి నుంచి కాస్తంత ఊపిరి పీల్చుకునే వీలు చిక్కుతుందన్న మాట వినిపిస్తోంది. మ‌రి.. జ‌గ‌న్ ఏం చేస్తారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English