కేసీఆర్.. ఆలయాల దర్శనం వెనుక రహస్యం ఇదే..!

కేసీఆర్.. ఆలయాల దర్శనం వెనుక రహస్యం ఇదే..!

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లోక్‌సభ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేకపోవడంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలతో సమావేశం కూడా అయ్యారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌యేతర కూటమి ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో గులాబీ అధినేత పని చేస్తున్నారు. ముందుగా ఈ ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ సీట్లను గెలుచుకుని ఢిల్లీలో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో మిత్రపక్షం మజ్లిస్‌తో కలిసి గెలుచుకోవాలని పట్టుదలతో ఉన్నారు. అందుకు అనుగుణంగా అడుగులు కూడా వేశారు.  

కేరళ సీఎంతో భేటీ అవడంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే అక్కడికి వెళ్లారని కూడా వార్తలు వచ్చాయి. కానీ, కేసీఆర్ పర్యటనల వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది.  ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మూఢనమ్మకాలు ఎక్కువన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఆయన ఇప్పటికే పలుమార్లు ఆయన యాగాలు, హోమాలు కూడా నిర్వహించారు. ఆయన నమ్మకానికి తగ్గట్లే ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్.. జోతిష్యుల సూచన మేరకు ఆలయాలను సందర్శించారని తెలిసింది. రాజయోగం కావాలంటే కొన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని జోతిష్యులు సూచించడం వల్లే ఆయన తన కుటుంబంతో కలిసి తంతు పూర్తి చేశారని సమాచారం.

కేసీఆర్.. ఐదు రోజుల వ్యవధిలో కేరళ, తమిళనాడులో పర్యటించారు. ఇందులో భాగంగా సోమవారం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం తమిళనాడులోని రామేశ్వరంలోని రామనాథస్వామి, పర్వతవర్థిని, రామసేతు, ధనుష్కోటి, పంచముఖి హనుమాన్‌, మధురైలోని మీనాక్షి, కన్యాకుమారి ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English