ఆ ఫోన్ తెచ్చిస్తే రూ.4ల‌క్ష‌లు ఇస్తార‌ట‌!

ఆ ఫోన్ తెచ్చిస్తే రూ.4ల‌క్ష‌లు ఇస్తార‌ట‌!

అదేమీ వ‌జ్రాలు పొదిగిన ఫోన్ కాదు.  ఆ మాట‌కు వ‌స్తే బంగారం కవ‌ర్ ఉన్న ఫోన్ కాదు. సాదాసీదా ఫోన్. మ‌హా అయితే రూ.20వేల కంటే త‌క్కువ విలువ చేసే ఫోన్. అలాంటి ఫోన్ పోయిన వేళ‌.. దాన్ని త‌యారుచేసిన కంపెనీ మాత్రం స‌ద‌రు ఫోన్ తెచ్చిస్తే ఏకంగా రూ.4ల‌క్ష‌ల రివార్డు ఇస్తాన‌ని ప్ర‌క‌టించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇంత‌కీ ఆ ఫోన్ కు అంత భారీ మొత్తంలో రివార్డు ఎందుకు ప్ర‌క‌టిస్తున్నార‌న్న‌ది చూస్తే..

ప్ర‌ముఖ మొబైల్ కంపెనీ హువావే స‌బ్ బ్రాండ్ అయినా హాన‌ర్ త‌యారు చేసిన ఫోన్ ఒక‌టి పోయింది. దాన్ని ఆ కంపెనీ ఉద్యోగి ప్ర‌యాణంలో పోగొట్టారు. దీంతో.. పోయిన ఆ ఫోన్ తిరిగి ఇస్తే రూ.4ల‌క్ష‌లు (5వేల యూరోలు) రివార్డుగా ఇవ్వ‌నున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది.

ఎందుకిలా అంటే.. దానికి కార‌ణం లేక‌పోలేదు. హాన‌ర్ త‌న కొత్త ఫోన్ ను త్వ‌ర‌లో లాంఛ్ చేయ‌నుంది. దానికి సంబంధించిన ఫోన్ ను ప‌రీక్ష‌ల్లో భాగంగా కంపెనీ ఉద్యోగి చేతికి ఇచ్చి పంపారు. అత‌గాడు జ‌ర్మ‌నీలోని మ్యూనిచ్ కు ప్ర‌య‌ణించిన రైల్లో దాన్ని పోగొట్టుకున్నారు. ఈ ఫోన్ కు బూడిద రంగు క‌వ‌ర్ ఉంటుంద‌ని కంపెనీ చెబుతోంది. ప్ర‌యోగ‌ద‌శ‌లో ఉన్న ఈ ఫోన్ ను మే 21లోపు తెచ్చిస్తే ఈ భారీ రివార్డు ఇస్తామంటున్నారు. ఎందుకంటే.. ఆ త‌ర్వాత ఆ ఫోన్ ను మార్కెట్లోకి విడుద‌ల చేయ‌నున్నారు. క‌నిపించ‌కుండా పోయిన ఫోన్ బ‌య‌ట‌కు రివీల్ కాకూడ‌ద‌న్న ఉద్దేశంతోనే ఈ భారీ రివార్డును కంపెనీ ప్ర‌క‌టించి ఉంటుంద‌ని చెబుతున్నారు. ఆస‌క్తిక‌రమైన విష‌యం ఏమంటే.. ఐఫోన్ 4.. గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ ఎల్ ఫోన్లు సైతం ప్ర‌యోగ‌ద‌శ‌లో పోవ‌టం గ‌మ‌నార్హం.మ‌రి.. ఇంత భారీ మొత్తం రివార్డు ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. పోయిన ఫోన్ ఆచూకీ ల‌భిస్తుందేమో చూడాలి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English