నాగబాబుని వరుణ్‌ గెలిపిస్తాడా?

నాగబాబుని వరుణ్‌ గెలిపిస్తాడా?

జనసేన పార్టీకి అసెంబ్లీ సీట్లు రావడమే గగనమని సర్వేలు చెబుతున్నాయి. రెండు నుంచి అయిదు సీట్లు వస్తాయంటూ వివిధ సర్వేలు పవన్‌ పార్టీని అట్టడుగున పడేస్తున్నాయి. ఇక ఎంపీ సీట్లకి అయితే జనసేన పోటీనే కాదని అంటున్నాయి. కాకపోతే విశాఖపట్నంలో జెడీ లక్ష్మీనారాయణ, నరసాపురంలో నాగబాబు ఎంపీ అభ్యర్థులుగా ప్రభావం చూపిస్తారనే అంచనాలున్నాయి. అయితే లోకల్‌ ట్రెండ్‌ ప్రకారం నాగబాబుకి విజయావకాశాలు తక్కువనే సంకేతాలు అందుతున్నాయి.

పవన్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ బిజీగా వుండడంతో అతని తరఫున భీమవరం అసెంబ్లీ స్థానానికి కూడా నాగబాబే ప్రచారం చేయాల్సి వస్తోంది. నాగబాబు స్టార్‌డమ్‌ సరిపోదు కనుక ఆయన పిల్లలు కూడా తలా ఒక చెయ్యి వేస్తున్నారు. ముందుగా నిహారిక తండ్రికి తోడు నిలవగా, ఇప్పుడు వరుణ్‌ తేజ్‌ కూడా రెండు రోజుల పాటు తండ్రికి సాయం అందించబోతున్నాడు. భీమవరంతో సహా నరసాపురం పార్లమెంటరీ నియోజికవర్గంలో కీలక స్థానాలని వరుణ్‌ పర్యటించనున్నాడు. వరుణ్‌ సినీ గ్లామర్‌, యూత్‌లో వున్న ఫాన్స్‌ వల్ల నాగబాబు విజయావకాశాలు మెరుగవుతాయా లేదా అనేది చూడాలి. లాస్ట్‌ డే ప్రచారానికి అల్లు అర్జున్‌ని తీసుకు రావాలని చూస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English