బాబు సీఎంగా ఉంటే మా ఇంట్లో హ‌త్య‌లే

బాబు సీఎంగా ఉంటే మా ఇంట్లో హ‌త్య‌లే

త‌న బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్యపై వైసీపీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్పందించారు. పులివెందుల‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, తన బాబాయ్‌ వివేకానందరెడ్డిని.. ఇంట్లోకి చొరబడి అత్యంత దారుణంగా కత్తులతో నరికి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన హత్యను పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. డ్రైవర్‌ పై నేపం నెట్టేందుకు లెటర్‌ను సృష్టించారని విమర్శించారు.. ఈ హత్య కేసులో రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని.. అందుకే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడే తమ ఇంట్లో హత్యలు జరుగుతున్నాయని జగన్‌ ఆరోపించారు .

బాబాయ్‌ హ‌త్య‌ కేసు దర్యాపు జరుగుతున్న తీరుపై అనుమానాలున్నాయని  వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. బెడ్ రూమ్ లో చంపేసి బాత్ రూమ్ వరకు తీసుకెళ్లారు. బాత్ రూమ్ లో రక్తాన్ని పోశారని జగన్ ఆరోపించారు. డ్రైవర్ మీద నెపం నెట్టడానికి లెటర్ సృష్టించారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదని స్ప‌ష్టం చేశారు.  విచారణ జరుపుతున్న అధికారులకు త‌న కళ్ళ ముందే ఫోన్లు చేశారని ఆరోపించారు. త‌న కళ్ల ముందే ఎస్పీకి ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారని అనుమానం వ్య‌క్తం చేశారు. నిజాలు బయటకు రావాలని, ఎందుకు చేశారన్న విషయం బయటపడాలని జ‌గ‌న్ పేర్కొన్నారు.

కేసును తప్పుదోవ పట్టించేందుకే అధికారులు ప్రయత్నం చేస్తున్నారని, గ‌తంలో కూడా ఇలాగే చేశార‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. బాబాయ్ హత్యపై సీబీఐ విచారణ విచారణకు ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు. తమ తాత రాజారెడ్డి, నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గతంలో ఇలానే కుట్రచేసి చంపేశారని..తనపైనా విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగిందన్నారు. ఈ మూడింటిలోనూ ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందని ఆరోపించారు.త‌మ నాన్న మృతిపై ఇప్పటికీ అనుమానాలున్నాని ఆయ‌న పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English