పవన్ ఓ విధంగా దెబ్బేసినట్లే

పవన్ ఓ విధంగా దెబ్బేసినట్లే

మహేష్ బాబు సినిమా రిలీజ్ రోజు అంటే మామూలుగానే అభిమానుల రచ్చ పీక్స్ లో ఉంటుంది. అలాంటిది సీఎం పాత్రలో మహేష్ కనిపించడం.. కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన మూవీ కావడం.. మిడ్ నైట్ నుంచి యూఎస్ లో పడ్డ ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ రావడం వంటివి జరిగాక.. భరత్ అనే నేను మూవీ టాప్ ట్రెండింగ్ లో ఉండాలి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ హంగామాకి ఇండియాలో టాప్ ట్రెండింగ్ జాబితాలోకి చేరాలి.

కానీ గత కొంతకాలంగా తనపై జరుగుతున్న దాడి వెనుక.. రాజకీయ హస్తం ఉందంటూ పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయాన్నే ట్వీట్ పెట్టాడు. ఆ తర్వాత ఫిలిం ఛాంబర్ కు తన ఫ్యామిలీలోని దాదాపు అందరు హీరోలను పిలిపించి.. ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడాడు. మరోవైపు ఇదే రోజున ఏపీలో సీఎం చంద్రబాబు పుట్టిన రోజు కావడం.. ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయడం వంటివి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే సీఎం తనయుడిపై పవన్ నేరుగా వ్యాఖ్యలు చేయడం.. మహేష్ ముఖ్యమంత్రిగా నటించిన భరత్ అనే నేను చిత్రం టాప్ ట్రెండింగ్ లోకి రాలేకపోయింది.

టాప్ 3 ట్రెండింగ్ లో పవన్ కళ్యాణ్‌ ఉన్నాడు.. కాని టాప్ 20లో 12 నుండి 17వ స్థానం మధ్యలో భరత్ అను నేను గురించి ట్రెండ్ అయ్యింది. ఒకవేళ పవన్ ఇష్యూ లేకపోతే.. భరత్ టాప్ 5 లోకి వచ్చేసేవాడే. మౌత్ టాక్ బాగుండడం.. క్లాస్ ప్లస్ మాస్ ను కొరటాల పక్కాగా మిక్స్ చేయడం.. వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముందురోజే టికెట్స్ బుక్ అయిపోయాయి కాబట్టి కలెక్షన్స్ కు ఢోకా ఉండదు కానీ.. ట్రెండింగ్ నిలబడేందుకు.. సినిమా టాక్ మరింతగా స్ప్రెడ్ అయేందుకు మాత్రం.. ఆస్కారం లేకుండా పోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు