సెలబ్రిటీలకు చుక్కలు చూపించిన 'మెట్రో'

సెలబ్రిటీలకు చుక్కలు చూపించిన 'మెట్రో'

కొత్తగా ఏదన్నా ప్రొడక్ట్ వచ్చిందంటే.. కామన్ పీపుల్ కు ఎంతటి ఆతృత ఉంటుందో మీడియాకు కూడా అంతే ఆతృత ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటైన మెట్రో రైలు అదే లీగ్ లోకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీడియా అండ్ మామూలు జనాలు అక్కడకు అలా ఎగబడుతున్నారు. బెంగుళూరు.. అహ్మదాబాద్ వంటి సిటీస్ లో తొలిరోజున కేవలం 50 వేలమంది లోపు ప్యాసింజర్లు మెట్రోలు ఎక్కితే.. ముత్యాల నగరంలో మాత్రం ఏకంగా 1 లక్ష మందికి పైగా ఎక్కేశారు.

ఇక చెప్పొచ్చేది ఏంటంటే.. సందట్లో సడేమియా అన్నట్లు చాలమంది సెలబ్రిటీలు కూడా నిన్న మెట్రో ఎక్కుదాం అని వెళ్లారట. చిన్నపాటి యాంకర్లు.. టివి నటులు.. వగైరా రేంజు పీపుల్ అందరూ వెళిపోయి.. అక్కడ నుండి సెల్ఫీలు.. వీడియోలు.. ఫేస్ బుక్ లైవులూ అంటూ బయలుదేరారు. వీరి సోషల్ మీడియా ఎకౌంట్లను ఆపరేట్ చేసి కొన్ని కంపెనీలు ఆ సలహా ఇచ్చాయట. కాని అక్కడకు వెళ్ళా క చూస్తే.. కనీసం జేబులో నుండి సెల్ ఫోన్ బయటకు తీసి క్లిక్ చేసుకునేంత అవకాశం కూడా లేకుండా పోయింది. ఇసుకేస్తే రాలనంత జనం. దానితో చుక్కలు కనిపించి.. ఎక్కడ మేకప్ కరిగిపోయి ఇబ్బందుల్లో పడతామో అనుకుని.. ఈ సెలబ్రిటీలు అసలు మెట్రో ఎక్కకుండానే వచ్చేశారట.

కొత్తగా ఏదన్నా వస్తే చాలు.. దాని గురించి టముకు వేద్దాం అని మన సెలబ్స్ ముందే ఉంటారులే. అయితే ఇక్కడ మెట్రోకు ఉన్న క్రేజుకు.. వీరు టముకు వేయకముందే ఆడియన్స్ డైరక్టుగా అక్కడికి వెళిపోయారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు