కేసీఆర్‌కు నంబ‌ర్ వ‌న్ ర్యాంక్ ఇచ్చిన స్వామీజీ

కేసీఆర్‌కు నంబ‌ర్ వ‌న్ ర్యాంక్ ఇచ్చిన స్వామీజీ

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌కు మ‌రోమారు నంబ‌ర్ వ‌న్ ర్యాంక్ వ‌చ్చింది. అప్పుడెప్పుడో ముఖ్య‌మంత్రుల ర్యాంకింగ్‌లో టాప్‌లో ఉన్న‌ట్లుగా తాజాగా అలాంటిదే ఇది కూడానా అని ఆలోచించ‌కండి. ఇది ఆ టైపు ర్యాంక్ కాదు. ఆధ్యాత్మిక‌ప‌ర‌మైన సేవ‌ల్లో. దేవుని సేవ‌ల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ టాప్‌లో ఉన్నార‌ని చిన‌జీయ‌ర్ స్వామి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. మిగ‌తా ముఖ్య‌మంత్రుల‌కు తెలంగాణ సీఎంకు చాలా తేడా ఉంద‌ని ప్ర‌శంసించారు.

భద్రాద్రి రామాలయంలో కన్నులపండువగా జ‌రిగిన సంధ్యాహారతి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చినజీయర్‌ స్వామి  రామాలయంలో పూజలు నిర్వహించారు. సంధ్యాహారతి కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, జలగం వెంకట్రావు హాజరైయ్యారు. అనంత‌రం చిన‌జీయ‌ర్ స్వామి మాట్లాడుతూ...రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే దేవుడి సేవ చేయాల‌న్నారు.

ఏ సీఎం చేయని విధంగా దేవుడి సేవలో కేసీఆర్‌ ముందున్నార‌న్నారు. దేవుళ్ల సొత్తు తినే ట్రెండ్‌కు కేసీఆర్‌ చరమగీతం పాడార‌ని, యాదాద్రి తరహాలో భద్రాద్రి అభివవృద్ధికి కంకణం కట్టుకున్న వ్య‌క్తి కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్‌కు, మంత్రి తుమ్మలకు మంగళశాసనములు అంటూ దీవించారు.

కాగా, మొదటినుంచి జీయర్ స్వామిజీకి, మైం హోమ్ సంస్థల అధిపతి జూపల్లి రామేశ్వరరావుకు మధ్య మంచి సంబంధాలున్నాయి. రామేశ్వరరావు స్థాపించిన ఉచిత ఆస్పత్రిని జియర్ స్వామి ప్రారంభింపచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, రామేశ్వరరావుకు ఉన్న దగ్గరి సంబంధాల వల్ల జీయర్ స్వామికి సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ప్ర‌చారం ఉంది. యాదగిరిగుట్ట నర్సింహస్వామి దేవాలయం పునర్ నిర్మాణం జీయర్ స్వామి ఆదేశాను సారం జరగాలంటూ సీఎం తేల్చిచెప్పారు. ఆ ప్ర‌కార‌మే ఇప్ప‌టికీ ప‌నులు జ‌రుగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు