క‌శ్మీర్‌ను సిరియా చేయాల‌నేది మాజీ సీఎం ఆలోచ‌నా?

క‌శ్మీర్‌ను సిరియా చేయాల‌నేది మాజీ సీఎం ఆలోచ‌నా?

మ‌న‌దేశ వ్య‌వ‌హారాల్లో అగ్ర‌రాజ్యం అమెరికా జోక్యం చేసుకోవ‌డం అనే ప్ర‌తిపాద‌న‌ల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాశ్మీర్ అంశంలో అమెరికా జోక్యం చేసుకుంటే అప్పుడు ప‌రిస్థితి సిరియా క‌న్నా దారుణంగా త‌యార‌వుతుంద‌ని జ‌మ్మూక‌శ్మీర్ సీఎం మెహ‌బూబా ముఫ్తీ అన్నారు. ఇటీవ‌ల నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌ నేత ఫారూక్ అబ్ధుల్లా మాట్లాడుతూ క‌శ్మీర్ అంశంపై అమెరికా, చైనా దేశాలు జోక్యం చేసుకోవాల‌ని సూచించారు. తాజాగా ఈ కామెంట్ల‌పై జమ్మూ క‌శ్మీర్ సీఎం స్పందిస్తూ ఫారూక్ అబ్దుల్లా క‌శ్మీర్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు. అస‌లు సిరియా, ఆప్ఘ‌నిస్తాన్‌లో ఏం జ‌రిగిందో ఆయ‌న‌కు తెలుసా అని ప్ర‌శ్నించారు. చైనా, అమెరికా దేశాలు త‌మ ప‌ని తాము చూసుకోవాల‌ని, వాళ్లు జోక్యం చేసుకున్న ఆఫ్ఘ‌నిస్తాన్‌, సిరియా, ఇరాక్ దేశాల ప‌రిస్థితి అందరికీ తెలుస‌న్నారు.

అమెరికా, తుర్కిస్తాన్‌, ఇంగ్లీష్‌స్తాన్‌ మొదలైనవి తమ మధ్య చర్చల్లో ఏం చేస్తాయని సీఎం ముఫ్తీ ప్రశ్నించారు. సిరియా, ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌లలో ప్రస్తుత పరిస్థితి ఏమిటి? మనకు కూడా ఆ పరిస్థితి రావాలని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ కోరుకుంటున్నారా అని మెహబూబా ముఫ్తీ అన్నారు.  భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య ద్వైపాక్షిక చ‌ర్చ‌ల ద్వారా మాత్ర‌మే క‌శ్మీర్ స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌న్నారు. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే విధంగా కాకుండా వివాదం ముదిరేలా నేత‌లు ప్ర‌య‌త్నించ‌వ‌ద్ద‌న్నారు.

కాగా, జమ్ము కాశ్మీర్‌లోని గండేర్బల్‌ ప్రాంతంలో సైనికులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌తో సహా ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. అమర్‌నాథ్‌ యాత్రనుంచి కొందరు ఆర్మీ జవాన్లు తిరిగి వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు