బంపర్ ఛాన్స్.. ఇప్పుడైనా హిట్టు కొడతాడా?

బంపర్ ఛాన్స్.. ఇప్పుడైనా హిట్టు కొడతాడా?

యువ కథానాయకుడు నితిన్‌ వరుసగా మూడు ఫ్లాపులతో బాగా దెబ్బ తిని ఉన్నాడు. అతడి గత మూడు సినిమాలు లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం.. వేటికవే ప్రామిసింగ్‌గా కనిపించాయి. ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించాయి. కచ్చితంగా హిట్టయ్యేలాగే కనిపించాయి. తీరా చూస్తే బాక్సాఫీస్ దగ్గర వీటికి ప్రతికూల ఫలితం ఎదురైంది. దీంతో ఈసారి అతను బాగా గ్యాప్ తీసుకున్నాడు.

 ఏడాదికి పైగా ఖాళీగా ఉండి.. చివరికి ‘భీష్మ’ సినిమాను ఓకే చేసి పట్టాలెక్కించాడు. ‘ఛలో’ లాంటి సూపర్ హిట్‌తో దర్శకుడిగా పరిచయం అయిన వెంకీ కుడుముల ఎంతో కష్టపడి స్క్రిప్టు తయారు చేసి, ఎంతో పకడ్బందీగా తెరకెక్కించిన చిత్రమిది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రాజీ లేకుండా నిర్మించింది. ఇటీవలే వచ్చిన ట్రైలర్ చూస్తే ‘హిట్టు’ సినిమాకు అవసరమైన హంగులన్నీ ఇందులో ఉన్నాయనిపించింది. శుక్రవారమే ఈ సినిమా రిలీజవుతోంది.

ప్రోమోలన్నీ బాగుండటం, పాజిటివ్ బజ్ ఉండటమే కాదు.. రిలీజ్ టైమింగ్ కూడా ‘భీష్మ’కు కలిసొచ్చే అంశమే. సంక్రాంతి సినిమాల హ్యాంగోవర్‌ నుంచి జనాలు బయటికి వచ్చినట్లే కనిపిస్తున్నారు. పండుగ సినిమాలతో జేబులకు చిల్లులు పడటంతో కొన్ని వారాల పాటు పెద్దగా సినిమాలు చూడలేదు. అందులోనూ మెజారిటీ ప్రేక్షకుల్ని మెప్పించే కమర్షియల్ ఎంటర్టైనర్లేవీ మధ్యలో రాలేదు. ‘భీష్మ’ వాళ్లు కోరుకునే సినిమాలాగే ఉంది.

సంక్రాంతి సినిమాలతో సహా ముందు వారాల్లో వచ్చిన చిత్రాలు చల్లబడిపోయిన సమయంలో ‘భీష్మ’ వస్తోంది. కాబట్టి మంచి టైమింగ్‌లో పాజిటివ్ బజ్ మధ్య వస్తున్న ‘భీష్మ’తో అయినా నితిన్ హిట్టు కొడతాడేమో చూడాలి. ఇంకో ఫ్లాప్ పడితే మాత్రం నితిన్ కెరీర్‌కు పెద్ద పంచ్ అన్నట్లే. మరోవైపు ‘ఛలో’ సక్సెస్ క్రెడిట్‌ను తనది కాదన్నట్లుగా నాగశౌర్య మాట్లాడిన నేపథ్యంలో ‘భీష్మ’తో తనేంటో చాటి చెప్పి శౌర్యకు పంచ్ ఇవ్వాలన్న కసితో వెంకీ ఉన్నాడు. మరి నితిన్, వెంకీల ఆశల్ని ‘భీష్మ’ ఏ మేర నిలబెడుతుందో చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English