అర్జున్‌రెడ్డిని ఫాలో అవుతున్న జార్జ్‌ రెడ్డి

అర్జున్‌రెడ్డిని ఫాలో అవుతున్న జార్జ్‌ రెడ్డి

చిన్న సినిమాలు జనం దృష్టిలో పడడమనేది అరుదుగా జరుగుతుంది. విడుదల కాకుండా ఒక చిన్న సినిమా పట్ల ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించరు. కానీ జార్జ్‌ రెడ్డి చిత్రానికి మాత్రం తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఫుల్‌ అటెన్షన్‌ లభిస్తోంది. స్టూడెంట్‌ లీడర్‌ జార్డ్‌ రెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రెయిలర్స్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ చిత్రానికి ఉచిత పబ్లిసిటీ ఇస్తున్నారు.

ఈ సినిమాపై అపారమైన నమ్మకం వుండడంతో రిలీజ్‌ శుక్రవారం అయినా కానీ గురువారం సెకండ్‌ షోస్‌కి పెయిడ్‌ ప్రీమియర్స్‌ ప్రదర్శిస్తున్నారు. అర్జున్‌ రెడ్డి తర్వాత ఒక చిన్న సినిమాకి ఇలా చేయడం ఇదేనంటే ఈ చిత్రంపై నిర్మాతలకి ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద సినిమాలకి కనీసం ఒక్క ప్రీమియర్‌ షో వేయడానికి కూడా నిర్మాతలు జంకుతున్నారు.

అలాంటిది ఒక చిన్న సినిమాకి అంతటా పెయిడ్‌ ప్రీమియర్లు వేస్తున్నారంటేనే దీనిపై ఎంత కాన్ఫిడెన్స్‌ వుందనేది తెలిసిపోతోంది. ఆల్రెడీ ఈ చిత్రం పట్ల ఆసక్తి వుంది కనుక రేపు వేసే ప్రీమియర్లతో మంచి టాక్‌ వచ్చినట్టయితే ఫస్ట్‌ వీకెండ్‌లో జార్జ్‌ రెడ్డి సందడి భారీస్థాయిలోనే వుంటుందని ఫిక్స్‌ అయిపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English