బాలయ్యంటే ఇష్టం.. ఆయనకో పెద్ద హిట్టిస్తా

బాలయ్యంటే ఇష్టం.. ఆయనకో పెద్ద హిట్టిస్తా

పైసా వసూల్‌ అట్టర్‌ఫ్లాప్‌ అయినా కానీ బాలకృష్ణతో మళ్లీ సినిమా చేయడానికి పూరి జగన్నాథ్‌ ఎదురు చూస్తున్నాడు. పూరీతో పని చేయడం చాలా ఎంజాయ్‌ చేసానని, అతనితో ఎప్పుడయినా మళ్లీ పని చేయడానికి సిద్ధమని బాలయ్య కూడా ప్రకటించారు. బాలకృష్ణకి హిట్‌ ఇవ్వలేకపోయాననే వెలితి వుండిపోయిందని, ఆయనంటే తనకి చాలా ఇష్టమని, త్వరలోనే ఆయనకోసం ఒక కథ రాస్తానని, ఆ సినిమాని పెద్ద హిట్‌ చేస్తానని పూరి జగన్నాథ్‌ మీడియాతో చెప్పాడు.

ఇస్మార్ట్‌ శంకర్‌ కథని రామ్‌ అడిగిన క్యారెక్టరైజేషన్‌నుంచి రాసానని, బ్యాడ్‌ బోయ్‌గా కనిపించాలని రామ్‌ కోరుకున్నాడని, అతడిని ఇంతవరకు ఎవరూ చూపించని విధంగా ఈ చిత్రంలో చూపించానని, అతని ఎనర్జీని ఇంతవరకు ఏ దర్శకుడు సరిగా వాడుకోలేదని, ఈ చిత్రంలో కొత్త రామ్‌ని చూస్తారని చెప్పాడు. ఈ చిత్రం ఓ హాలీవుడ్‌ చిత్రానికి కాపీ అనే రూమర్లని పూరి కొట్టి పారేసాడు. కొన్ని హాలీవుడ్‌ సినిమాలు చూసి స్ఫూర్తి పొంది ఈ కథ రాసిన మాట వాస్తవమే కానీ, ఈ కథ అచ్చంగా తన సొంతమని, ఇది కాపీ మాత్రం కాదని పూరి నొక్కి చెప్పాడు. కాపీనా కాదా అనే సినిమా చూసి తేల్చుకోవచ్చు కానీ ఫ్లాపుల్లో వుండి కూడా తన సినిమాకి క్రేజ్‌ రాబట్టడంలో మాత్రం పూరి సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. ఇటీవలి కాలంలో విడుదలకి ముందు ఏ సినిమాకీ లేని బజ్‌ని తన సినిమాకి తీసుకొచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English