వరస్ట్‌ ట్రెయిలర్‌... అయినా 35 కోట్లు!

వరస్ట్‌ ట్రెయిలర్‌... అయినా 35 కోట్లు!

'ఇస్మార్ట్‌ శంకర్‌' ఫస్ట్‌ ట్రెయిలర్‌ చూసి లౌడ్‌గా వుందని, మరీ అతిగా అనిపిస్తోందని చాలా కామెంట్లు చేసారు. కొందరయితే 'వరస్ట్‌ ట్రెయిలర్‌' అని తిట్టిపోసారు. దీంతో పూరి జగన్నాథ్‌ మరో ట్రెయిలర్‌ కట్‌ చేయించాడు. ఈసారి ఇంకాస్త అతి పెట్టి, మరిన్ని బూతులతో నింపేసాడు. 'ఇస్మార్ట్‌ శంకర్‌' క్యారెక్టరే ఇంత అనేది తెలియజెప్పడం పూరి ఆలోచన కావచ్చు. సోషల్‌ మీడియాలో ఈ చిత్రానికి ఎలాంటి రియాక్షన్లు వచ్చినా కానీ ట్రేడ్‌ పరంగా మాత్రం ఇప్పుడీ సినిమా రెడ్‌ హాట్‌గా మారింది. ఇటీవలి కాలంలో మాస్‌ సినిమాలేవీ రాకపోవడంతో ఈ చిత్రానికి బి, సి సెంటర్లలో జనం బారులు తీరిపోతారని బిజినెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పూరి జగన్నాథ్‌ ఈమధ్య కాలంలో తీసిన సినిమాలు ఎంత చిరాకు పెట్టినా కానీ దీనికి మాత్రం పొటెన్షియల్‌ వుందనే భావిస్తున్నాయి. అందుకే ఈ చిత్రానికి పద్ధెనిమిది కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగింది. నాన్‌ థియేట్రికల్‌ ఇంచుమించు అంతే వుంటుందట. మొత్తానికి దీనిపై ముప్పయ్‌ అయిదు కోట్లు వచ్చాయి. రామ్‌ రెమ్యూనరేషన్‌ లేకుండా ఈ చిత్రాన్ని పదిహేను కోట్లలో తీసేసిన పూరి జగన్నాథ్‌కి ఎలా చూసినా పదిహేను కోట్లు తక్కువ మిగలవన్నమాట. ఇస్మార్ట్‌ జగన్నాథ్‌!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English