ఫ్లాప్‌ క్వీన్‌ ఖాతాలో మరో డిజాస్టర్‌

ఫ్లాప్‌ క్వీన్‌ ఖాతాలో మరో డిజాస్టర్‌

బాహుబలిలో నటించిన వారిలో చాలా మంది కెరియర్స్‌ అద్భుతంగా సాగుతోంటే తమన్నా మాత్రం వరుస పరాజయాలని చవిచూస్తోంది. ఎఫ్‌ 2తో బ్లాక్‌బస్టర్‌ సినిమాలో భాగమయ్యానని చెప్పుకోగలిగినా కానీ అందులో ఆమెకి వచ్చిన పేరంటూ ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే తన నటనని చిరాకు పడిన వాళ్లే ఎక్కువ. ఆ ఒక్కటీ మినహాయిస్తే తమన్నా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద డింకీలు కొట్టడం పరిపాటి అయిపోయింది.

గత ఏడాది నా నువ్వే, నెక్స్‌ట్‌ ఏంటి లాంటి డిజాస్టర్స్‌లో నటించిన తమన్నా ఇటీవల విడుదలయిన సినిమాలతో మరో రెండు ఘోరమైన డిజాస్టర్స్‌ చవిచూసింది. రెండు వారాల క్రితం విడుదలయిన అభినేత్రి 2 కనీసం సోదిలో కూడా లేకుండా పోయింది. మళ్లీ ప్రభుదేవాతోనే కలిసి తమన్నా హిందీలో నటించిన ఖామోషీ శుక్రవారం విడుదలయి నామమాత్రపు ఆదరణ కూడా దక్కించుకోలేకపోయింది.

మొదటి షో పడడంతోనే డిజాస్టర్‌ అనిపించుకున్న ఖామోషీ తమన్నా ఫ్లాపుల చిట్టాకి మరో సంఖ్య జోడించింది. తన కంటే ముందు వచ్చిన వాళ్లు, తన సమకాలికులు ఇంకా రాణిస్తూ వుంటే తమన్నా మాత్రం ఫ్లాప్‌ క్వీన్‌గా ముద్ర వేయించుకుంది. త్వరలో విడుదలయ్యే సైరా, దటీజ్‌ మహాలక్ష్మి చిత్రాలయినా తనని విజయాల బాటలో నడిపిస్తాయని ఆశిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English