ప్రభాస్‌ను చూసి భయపడ్డట్లేగా..

ప్రభాస్‌ను చూసి భయపడ్డట్లేగా..

ఆల్రెడీ స్టార్ ఇమేజ్ ఉండి.. ఒకే ఒక్క సినిమాతో పది రెట్లు మార్కెట్ పెంచుకున్న కథానాయకుడు ఇండియాలో ఒక్క ప్రభాస్ మాత్రమే అయ్యుంటాడు. ‘బాహుబలి’ అతడి కెరీర్లో అంత గొప్ప మార్పు తీసుకొచ్చింది. దీనికి ముందు అతను నటించిన ‘మిర్చి’కి రూ.30 కోట్ల బిజినెస్ జరిగింది. ‘బాహుబలి’ లెక్కల గురించి పక్కన పెట్టేస్తే.. దీని తర్వాత ‘సాహో’కు ఏకంగా రూ.300 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతోంది. ఇక అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా అతడికి అభిమానులు పెరిగారు.

ఇప్పుడు అతడి సినిమా వస్తోందంటే అన్ని భాషల వాళ్లూ ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి ఉంది. ప్రభాస్ సినిమాకు పోటీగా హిందీ, తమిళ చిత్రాల్ని రిలీజ్ చేసే పరిస్థితి లేదు. ‘సాహో’ను ఆగస్టు 15కి షెడ్యూల్ చేయగానే ఆ తేదీకి రావాలనుకున్న మిగతా హిందీ సినిమాల్ని వాయిదా వేయాలన్న నిర్ణయానికి వచ్చే పరిస్థితి కనిపించింది.

ఐతే తమిళంలో మాత్రం సూర్య కొత్త సినిమా ‘కాప్పన్’ను ఆగస్టు 15కే షెడ్యూల్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. స్వయంగా సూర్యనే ఇంతకుముందు ఈ డేట్ ప్రకటించాడు. ‘సాహో’ మీద ఉన్న అంచనాలుు, తెలుగు, తమిళ మార్కెట్లో దాన్నుంచి ఉండే పోటీ గురించి తెలిసి కూడా సూర్య ఇలా రిలీజ్ డేట్ ప్రకటించాడేంటి అని ఆశ్చర్యపోయారంతా. తమిళ మీడియాలో కూడా దీని గురించి వార్తలొచ్చాయి.

ఐతే తెలియక రిలీజ్ డేట్ చెప్పాడో ఏమో తెలియదు కానీ.. ఇప్పుడీ ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాజాగా ‘కాప్పన్’ టీజర్ రిలీజ్ సందర్భంగా ఈ చిత్రాన్ని ఆగస్టు 30 విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే ‘సాహో’కు సూర్య భయపడ్డాడనే అనుకోవాలి. వరుస ఫ్లాపులతో ఆల్రెడీ సూర్య మార్కెట్ డౌన్ అయి ఉంది. ఇలాంటి సమయంలో ‘సాహో’ లాంటి మెగా ప్రాజెక్టుకు ఎదురెళ్తే కష్టమని సూర్య వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ‘కాప్పన్’ కంటే ముుందు మే 31న సూర్య నుంచి ‘ఎన్జీకే’ రాబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English