మళ్ళీ జోడి కట్టడానికి కోటిన్నర అడిగింది

మళ్ళీ జోడి కట్టడానికి కోటిన్నర అడిగింది

కెరీర్ ను తెలీకుండా ఒకే ఒక్క సినిమా చేంజ్ చేస్తుంది. కిందపడినా పడి లేచినా సరైన ఛాన్స్ అందుకొని హిట్టుకోడితే మళ్ళీ ఫామ్ లోకి రావడం సినీ తారలకు మాములే. ఇకపోతే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కూడా అలాంటి మంచి ఆఫర్ కోసమే ఎదురుచూస్తోంది. అయితే హిట్స్ లేకపోయినా రెమ్యునేషన్ లో ఏ మాత్రం తగ్గడం లేదని టాక్.

అమ్మడు మహేష్ బాబుతో చేసిన స్పైడర్ సినిమా దారుణమైన రిజల్ట్ ని ఇవ్వడంతో అప్పటి నుంచి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. కోలీవుడ్ లో అరకొరగా సినిమాలు చేస్తూ కెరీర్ ను నెట్టుకొస్తున్న తరుణంలో దేవ్ సినిమా ఫ్లాపవ్వడంతో కాస్త ఆలోచనలో పడింది అమ్మడు. అయితే తెలుగులో వెంకీ మామ సినిమాలో నటించే అవకాశం దక్కిందిలే. కాని అసలు సిసలైన ఆఫర్ ఏంటంటే.. మరోసారి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించేందుకు అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. గతంలో ఈ జోడీ కలసి చేసిన జయ జానకి నాయక సినిమా అంతగా వర్కౌట్ అవ్వలేదు. అయినా కూడా కొత్త సినిమాకు రకుల్ కోటిన్నర వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రమేశ్ వర్మ డైరెక్షన్ లో బెల్లంకొండ నటిస్తున్న తమిళ సినిమా రాట్ససన్ రీమేక్ త్వరలోనే మొదలు కానుంది. రీసెంట్ గా కథను విన్న రకుల్ సింగిల్ సిట్టింగ్ లొనే పేమెంట్ అగ్రిమెంట్ పై సైన్ కూడా చేయించుకుందట. హై పేమెంట్ సరే.. ఇప్పుడు రకుల్ కు హై రేంజ్ హిట్టు కూడా కావాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English