ఏమయ్యా హరీష్.. ఇది నిజమేనా?

ఏమయ్యా హరీష్.. ఇది నిజమేనా?

దువ్వడా జగన్నాథమ్ సినిమాతో హంగామా చేసి చాలా గ్యాప్ తీసుకున్న హరీశ్ శంకర్ మరో ప్రాజెక్టు పట్టాలెక్కించడానికి తెగ కష్టపడుతున్నాడు. తమిళ్ కథ జిగర్తాండ ను చేతిలో పట్టుకొని చాలా మంది హీరోలను కలిశాడు. స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసి ఇద్దరి హీరోలకు కథను వినిపించిన హరీష్ చివరకు వారిని కాదని మరో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఇది ఎంతవరకు నిజమో గాని మొదట రవితేజ మరియు సాయి ధరమ్ తేజ్ ల దగ్గరకు ఈ కోలీవుడ్ కథ వెళ్లినట్లు తెలుస్తోంది. అమర్ అక్బర్ ఆంటోనీ షూటింగ్ లో బిజీగా ఉండగా మస్ రాజకు కథను వినిపించిన హరీష్ ఆ సినిమా రిలీజ్ తరువాత మనసు మార్చుకున్నాడట. ఇక రెండు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న సాయి ధరమ్ తేజ్ దగ్గరకు వెళ్లి ఆల్ మోస్ట్ గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడు. అయితే షూటింగ్ లతో బిజీగా ఉండటం వల్ల సాయి కొంచెం టైమ్ అడిగాడు. కాని ఇప్పుడు రవి తేజ అండ్ సాయి ధరమ్ తేజ్ లకు కనీసం ఓ మాట అయినా చెప్పకుండా హరీష్ ప్రాజెక్ట్ ను వరుణ్ తేజ్ కి షిఫ్ట్ చేశాడట.

అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను వరుణ్ చేస్తున్నట్లు ఇటీవల క్లారిటీ వచ్చింది. మరో కుర్ర హీరో నాగ శౌర్య ఇతర లీడ్ రోల్ లో ఫైనల్ అయ్యాడు. కనీసం ఇంటిమీట్ చేయకుండా హరీష్ తీసుకున్న నిర్ణయంతో మాస్ రాజా అండ్ సుప్రీమ్ హీరో హార్ట్ అయినట్లు తెలుస్తోంది. సర్లేండి.. డైరక్టర్ తనకు నచ్చిన హీరోతో తను ప్రొసీడ్ అవ్వడంలో తప్పులేదు. మరీ హీరోల కోసం అన్నేసి రోజులు వెయిటింగ్ చేయాలంటే ఎలా!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English