రంగమ్మత్తకి ఎర్త్‌ పెట్టేసింది!

రంగమ్మత్తకి ఎర్త్‌ పెట్టేసింది!

కాంపిటీషన్‌ బీభత్సంగా వున్న గ్లామర్‌ ఫీల్డులో ఒక్కసారి కూడా తమకి రీ ప్లేస్‌మెంట్‌ రాకుండా చూసుకుంటేనే ప్లేస్‌ పదిలంగా వుంటుంది. సినిమాల్లో బిజీ అవుతోన్న అనసూయ తనని ఇంత పాపులర్‌ చేసిన జబర్దస్త్‌ని పోగొట్టుకునేలా వుంది. జబర్దస్త్‌ షోకి పర్మినెంట్‌ హోస్ట్‌గా మారిపోయిన అనసూయ సినిమాల్లో ఎంత బిజీ అయినా కానీ దీనిని విడిచి పెట్టదు. స్టడీ ఇన్‌కమ్‌ సోర్స్‌గా వున్న షోని ఎవరు మాత్రం వదులుకుంటారు. అయితే చిన్న గ్యాప్‌ ఇవ్వడంతో ఆమెకి బదులు వర్షిణి అనే నటిని తెచ్చి కొద్ది రోజులు రీప్లేస్‌ చేసారు.

అవడానికి టెంపరరీ యాంకరే అయినా కానీ వర్షిణికి ఫీడ్‌బ్యాక్‌ అదిరిపోతోంది. అనసూయ బోర్‌ కొట్టేస్తోందని, జబర్దస్త్‌కి కొత్త కళ అవసరం అని, అనసూయ కూడా ముదిరి ఆంటీలా కనిపిస్తోందని, వర్షిణిని పర్మినెంట్‌ చేసేయండని కామెంట్లతో పబ్లిక్‌ జబర్దస్త్‌ మేనేజ్‌మెంట్‌కి ఫీడ్‌బ్యాక్‌ బలంగా ఇస్తున్నారు. దీంతో అనసూయని రీప్లేస్‌ చేయాలా, వర్షిణిని పర్మినెంట్‌ చేయాలా అనే ఆలోచన కూడా స్టార్ట్‌ అయినట్టు గుసగుసలాడుకుంటున్నారు. ఏకులా వచ్చి మేకు అయినట్టు, రెండు రోజుల పాటు తన కుర్చీలో కూర్చోనిస్తే దానినే పట్టుకుపోయేలా వుంది వర్షిణి. ఏ షో అయినా, సినిమా అయినా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవ్వాల్సిందేగా మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English