చిత్ర-లహరి కోసం రాజీపడ్డ తేజ్‌!

చిత్ర-లహరి కోసం రాజీపడ్డ తేజ్‌!

హిట్టొచ్చి చాలా కాలమవుతోన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌కి ఈ యేడాదిలో ఇప్పటికే రెండు కోలుకోలేని షాక్‌లు తగిలాయి. ఇంటిలిజెంట్‌, తేజ్‌ ఐ లవ్యూ భారీ డిజాస్టర్లు కావడంతో తేజ్‌ డైలమాలో పడిపోయాడు. ఎప్పుడూ లేనిది సినిమాల మధ్య గ్యాప్‌ తీసుకుని యుఎస్‌ వెళ్లి రిలాక్స్‌ అయి వచ్చాడు. 'నేను శైలజ' దర్శకుడు కిషోర్‌ తిరుమలతో 'తేజ్‌' రిలీజ్‌కి ముందే ఒప్పందం చేసుకున్న 'చిత్రలహరి' చిత్రాన్నే చేయాలా వద్దా అనే మీమాంసనుంచి బయటపడి ఇటీవలే ముహూర్తం కూడా చేసాడు. తేజ్‌ ఫామ్‌లో వుంటే ఈ చిత్రానికి టాప్‌ రేంజ్‌లో వున్న హీరోయిన్లు దొరికేవారేమో.

ప్రస్తుతం అతను డౌన్‌ అయి వుండడంతో చిత్ర, లహరి పాత్రలకి ఇద్దరు హీరోయిన్ల విషయంలోను రాజీ పడాల్సి వచ్చింది. 'హలో'తో పరిచయం అయిన కళ్యాణి చిత్రగా, 'మెంటల్‌ మదిలో' చిత్రంలో నటించిన నివేతా పేతురాజ్‌ లహరిగా ఈ చిత్రంలో నటించబోతున్నారు. హీరోయిన్ల పేర్లే టైటిల్‌గా వున్న చిత్రానికి వీళ్లిద్దరినీ ఎంచుకోవడం ఆశ్చర్యపరిచే విషయమే. ప్రస్తుతానికి తేజ్‌కి ఇంతకంటే ఆప్షన్‌ లేదు మరి. రెండు హిట్లు పడితే తప్ప కాస్త లీడింగ్‌లో వున్న హీరోయిన్లు తేజ్‌తో ఆఫర్‌ వచ్చినపుడు తీరిక చేసుకోరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English