మన్మథుడు-2.. చైతూ ఒకలా, నాగ్ ఇంకోలా

మన్మథుడు-2.. చైతూ ఒకలా, నాగ్ ఇంకోలా

అక్కినేని నాగార్జున కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమా ‘మన్మథుడు’. ఈ సినమా తర్వాత నాగ్‌ను అందరూ మన్మథుడనే పిలవడం మొదలుపెట్టారు. నాగార్జున అందాన్ని, ఆయన స్టైల్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆయనకు తగ్గట్లుగా పాత్రను తీర్చిదిద్దారు త్రివిక్రమ్, విజయ్ భాస్కర్.

ఈ సినిమాకు సీక్వెల్ అంటూ ఈ మధ్య వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఈ మధ్యే నాగ్ తనయుడు నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసినపుడు క్లారిటీ ఇచ్చాడు. తమ సంస్థలో ‘మన్మథుడు-2’ పేరుతో సినిమా రాబోతున్న మాట వాస్తవమే అని.. ‘చి ల సౌ’తో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని అతనన్నాడు.

ఐతే ఇప్పుడు ‘దేవదాస్’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన నాగార్జున సైతం ‘మన్మథుడు-2’ గురించి మాట్లాడాడు. తమ సంస్థ పేరు మీద ఈ టైటిల్ రిజిస్టర్ చేయించిన మాట వాస్తవమే అని.. ఐతే అది తన కోసం అనుకుని రిజిస్టర్ చేయలేదని అన్నాడు నాగ్. తనకో.. తన కొడుకులకో ఉపయోగపడుతుందని.. టైటిల్ అయితే రిజిస్టర్ చేశామని.. ఇలా తమ దగ్గర ఎన్నో టైటిళ్లు ఉన్నాయని నాగ్ అన్నాడు. రాహుల్ రవీంద్రన్ తయారు చేస్తున్న కథకే ‘మన్మథుడు-2’ అనే టైటిల్ పెట్టనున్నట్లు నాగ్ చెప్పలేదు.

ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదన్నాడు. ఇంకా కథ ఓకే చేయలేదని.. రాహుల్ స్క్రిప్టు తయారు చేస్తున్నాడని.. ఇది తమ సంస్థలో వచ్చిన గత చిత్రాల్లాగే కామెడీ, రొమాంటిక్ అంశాలతో తెరకెక్కుతుందని నాగ్ చెప్పాడు. తమిళంలో ధనుష్ దర్శకత్వంలో మల్టీస్టారర్ చేస్తున్న విషయాన్ని కూడా నాగ్ ధ్రువీకరించాడు. ఆ చిత్రంలో తన పాత్ర ప్రత్యేకమైందని.. ఆ చిత్రం తెలుగులోనూ విడుదలవుతుందని నాగ్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English