సుమంత్ టీం ఎత్తుకొచ్చేసిందా?

సుమంత్ టీం ఎత్తుకొచ్చేసిందా?

‘మళ్ళీ రావా’ సినిమాతో చాలా కాలం తర్వాత ఒక విజయాన్నందుకున్నాడు సుమంత్. ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ ఏమీ కాలేదు కానీ.. సుమంత్‌కు మాత్రం మంచి పేరు తెచ్చింది. అతడి కెరీర్‌కు ఊపునిచ్చింది. ఈ ఉత్సాహంలో అతను ఒకటికి రెండు ఇంట్రెస్టింగ్ మూవీస్ లైన్లో పెట్టాడు. అందులో ఒకటి ‘సుబ్రహ్మణ్యపురం’ కాగా.. మరొకటి ‘ఇదం జగత్’.

ఇందులో రెండో సినిమా టీజర్ తాజాగా లాంచ్ అయింది. ఆ టీజర్ చూస్తే ఆసక్తికరంగానే అనిపిస్తోంది. దృష్టిపెడితే ప్రతిదీ వార్తే అని నమ్మే ఓ కుర్రాడు.. సెన్సేషనల్ న్యూస్‌ అనిపించే ఉదంతాల్ని కవర్ చేయడం ద్వారా ఏం సాధించాడు అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఐతే ఈ టీజర్ ఆసక్తికరంగా ఉందంటూ ఓవైపు ప్రశంసలు దక్కుతుండగానే.. ఇది ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అనే ఆరోపణలు మొదలయ్యాయి.

నాలుగేళ్ల కిందట విడుదలై మంచి విజయం సాధించిన ‘న్యూస్ క్రాలర్’ అనే సినిమా కాన్సెప్ట్‌ను ‘ఇదం జగత్’ దర్శకుడు కాపీ కొట్టి ఈ సినిమా చేస్తున్నాడని అంటున్నారు. ‘న్యూస్ క్రాలర్’ ట్రైలర్ చూస్తే ఈ ఆరోపణలు నిజమే అనిపిస్తోంది. అందులో ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైన హీరో.. తాను ఎదగడానికి ‘సెన్సేషనల్ న్యూస్’ కవరేజీనే మార్గంగా ఎంచుకుంటాడు.

యాక్సిడెంట్లు.. మర్డర్ల గురించి ముందే తెలుసుకుని.. వాటిని లైవ్ లో కవర్ చేయడం.. ఆ ఫీడ్ ను అమ్ముకోవడం ద్వారా భారీగా డబ్బు ఆర్జించడం.. ఆపై చిక్కుల్లో పడటం.. ఈ నేపథ్యంలో ఆ కథ నడుస్తుంది. ‘ఇదం జగత్’ టీజర్లో అయితే ఆ సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి. మరి ఇది యాదృచ్ఛికంగా జరిగిందా.. లేక నిజంగా కాపీనా.. కాపీ అయితే ఎంత మేరకు జరిగింది అన్న విషయాలు సినిమా చూస్తే కానీ తెలియవు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు