ఎందుకొచ్చిన హీరో కష్టాలు..

ఎందుకొచ్చిన హీరో కష్టాలు..

అందాల రాక్షసితో కెరీర్ మొదలుపెట్టిన అందగాడు రాహుల్ రవీంద్రన్ కు హీరోగా పెద్దగా సక్సెస్ లు రాలేదు. చూడటానికి ఒడ్డూ పొడవు బావుండి లవర్ బాయ్ లా కనిపించినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు ఏమీ చేయలేదు. చివరకు శ్రీమంతుడు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినా సినిమా ఆడింది కానీ అందులో రాహుల్ రవీంద్రన్ ను ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు.

హీరోగా చేస్తున్న సినిమాలన్నీ చేదు అనుభవాలే మిగల్చడంతో రాహుల్ రవీంద్రన్ రూటు మార్చాడు. ఫ్లాపు సినిమాలు చేసి ప్రేక్షకులకు దూరం అవడం ఎందుకు అనుకుని చక్కగా డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పుడ అతడికి ఇదే కలిసొచ్చినట్టుంది. ప్రస్తుతం సుశాంత్ హీరోగా ‘చి ల సౌ’ సినిమా తీశాడు. ఈ సినిమా చివరిలో బడ్జెట్ ప్రాబ్లెంతో ఆగింది. సుశాంత్ మేనమామ - హీరో నాగార్జునకు ఈ సినిమా తీసిన తీరు నచ్చడంతో రైట్స్ కొనేసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే రిలీజ్ చేస్తున్నాడు.

దీంతోపాటు తరవాత సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగచైతన్య హీరోగా తీసే సినిమాకు డైరెక్షన ఛాన్స్ రాహుల్ రవీంద్రన్ కే ఇచ్చారు. సిద్దార్ధ్ తరహాలో ఫ్లాపు సినిమాలు తీసి.. ఆడియన్స్ కు సినిమాలు చూడ్డం రాదు అని తిట్టిపోసే బదులు.. చక్కగా డైరక్టర్ అయిపోయి సెటిలైపోదాం అనుకుంటున్నట్లున్నాడులే. ఈ రెండు సినిమాలు హిట్ కొడితే ఇక యాక్టింగ్ వైపు తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు రాహుల్ రవీంద్రన్ కు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English