హీరోయిన్లకు కొత్త వాచీలు ఇచ్చేసి..

హీరోయిన్లకు కొత్త వాచీలు ఇచ్చేసి..

మ‌హిళా దినోత్స‌వాన్ని త‌మ‌కు అనుగుణంగా మార్చుకోవ‌డంలో వ్యాపార‌సంస్థ‌లు ముందుంటాయి. మిగ‌తా 364 రోజులూ ప‌ట్టించుకోరు కానీ...ఒక్క ఉమెన్స్ డే రోజున మాత్రం బోలెడు ఆఫ‌ర్లిస్తారు. త‌మ ఉత్ప‌త్తుల‌ను ఉచితంగా మ‌హిళా సెలెబ్రిటీల‌కు పంచుతారు. టిస్స‌ట్ వాచీల కంపెనీ అదే ప‌ని చేసింది. కొంద‌రు సెలెబ్రిటీ హీరోయిన్ల‌కు త‌మ ఖ‌రీదైనా వాచీల‌ను బ‌హుమానంగా పంపించి... వారి చేత ఉచితంగా ప్ర‌చారం చేయించుకుంది.

టిస్స‌ట్ ఖ‌రీదైన వాచీల సంస్థ‌. సామాన్యులు కొన‌లేని స్థాయిలో వీటి ఖ‌రీదులు ఉంటాయి. మంచి వాచీ కావాలంటే... క‌నీసం ముప్పై వేల రూపాయ‌లు ఖ‌ర్చుపెట్టాల్సిందే. అలాంటి వాచీల‌కు ప‌బ్లిసిటీ కోసం మ‌రింత ఎక్కువ ఖ‌ర్చుపెట్టి ప్ర‌చారం చేయాలి. ప్ర‌త్యేకంగా ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం లేకుండా... ర‌కుల్ ప్రీత్ లాంటి టాప్ హీరోయిన్ల‌కు త‌మ వాచీల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చింది టిస్స‌ట్. వాటిని పెట్టుకున్న హీరోయిన్లు త‌మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ వాచీ పెట్టుకున్న ఫోటోని పోస్టు చేసి... టిస్స‌ట్‌కు ఫ్రీ ప‌బ్లిసిటీ ఇస్తున్నారు. భామలకు కొతత వాచీలు ఇచ్చేసి.. మ‌హిళా దినోత్స‌వాన్ని బాగానే ఉప‌యోగించుకుందనమాట ఈ బ్రాండ్. వాటే ఐడియా గురూ!!

ర‌కుల్ ప్రీత్ ఉమెన్స్ డే సంద‌ర్భంగా తాను వాచీ పెట్టుకున్న ఫోటోతో పాటూ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపింది. వేవ్ ఆఫ్ చేంజ్ క్యాంపెయిన్ లో భాగ‌స్వామిగా ఉన్నందుకు ఆనంద‌ప‌డుతున్న‌ట్టు చెప్పారు. సృష్టించే శ‌క్తి... దేనినైనా మార్చే శ‌క్తి ఆమెకే ఉంద‌ని పేర్కొంది. మ‌హిళలంద‌రూ ప్ర‌త్యేక‌మేన‌ని అంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు