ఆడని క్రయిమ్ కథకు 4వ సీక్వెల్

ఆడని క్రయిమ్ కథకు 4వ సీక్వెల్

ఒక సినిమా చాలా పెద్ద హిట్ అయితేనే లేక కథ పెద్దగా ఉన్నప్పుడో రెండు మూడు పార్ట్ లుగా సినిమాలు తీయడం చూస్తూ ఉంటాం. ఆర్య సూపర్ హిట్ అవ్వడం వల్ల ఆర్య 2 వచ్చింది. అలానే కథ పెద్దది అవ్వడం వల్ల రాజమౌళి బాహుబలి ని రెండు పార్టీలుగా విడుదల చేశారు. కానీ ప్లాప్ అయిన సినిమాలకు సీక్వెల్స్ ని చూసారా?

పూజ గాంధీ, రఘు ముఖర్జీ ముఖ్యపాత్రలో శ్రీనివాస రాజు దర్శకత్వంలో ఒక క్రైమ్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే దండుపాళ్యం. ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో కూడా విడుదల చేయడం విశేషం. మిగతా భాషలో సినిమా ఎలా ఉన్నా, తెలుగు లో మాత్రం ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. థియేటర్లలోకి ఎలా వచ్చిందో మళ్ళీ అలాగే వెళ్ళిపోయింది. వింత కాకపోతే ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. సీక్వెల్ అంటే రెండో పార్టు ఏమో అనుకోకండి నాలుగో పార్ట్. అవును నిజమే. దండుపాళ్యం 2 వచ్చి ఫ్లాపయ్యాక.. దండుపాళ్యం 3 ఇంకా రిలీజవ్వాల్సి ఉండగా.. ఇప్పుడు దండుపాళ్యం 4 కూడా రాబోతుంది.

ఇప్పటికే మూడు పార్ట్ లు అదే క్రయిమ్ కథను చూపించి చూపించి ఇబ్బందిపెట్టేశాయి. ఇప్పుడు మళ్లీ నాల్గవ సినిమా తో ప్రేక్షకులకు తల నొప్పి తెప్పిస్తున్నారు అనే చెప్పాలి. అయినా ప్లాప్ సినిమాకి ఒక సీక్వెల్ వస్తే సర్లే మొదటిది ఆడలేదుగా రెండోది ఆడుతుందేమో అన్న ఆశతో తీసుంటారు అనుకోవచ్చు. మరీ దారుణంగా నాలుగో సీక్వెల్.. అదీ కూడా నేరాలు ఘోరాలు టివి సో చూసినట్లు మర్డర్లే మర్డర్లే. వామ్మో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు