మెగాస్టార్ పక్కనే కంగన??

మెగాస్టార్ పక్కనే కంగన??

ఎలాంటి క్యారెక్టర్ అయినా పండించేయడంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్పెషలిస్ట్. ప్రస్తుతం ఈ బ్యూటీ మణికర్ణిక మూవీ చేస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. రాణీ లక్ష్మీ బాయ్ పాత్రలో కనిపించనుంది కంగనా.

మణికర్ణిక మూవీ తర్వాత కంగనా చేయబోయే ప్రాజెక్ట్ గతంలోనే ఫిక్స్ అయింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ అరుణిమ సిన్హా పాత్రలో కనిపించేందుకు యాక్సెప్ట్ చేసింది కంగనా రనౌత్. అయితే.. ఈ ప్రాజెక్టు ఇప్పుడప్పుడే ప్రారంభమయ్యే లక్షణాలు కనిపించడం లేదు. దీంతో ఇపుడు మరో ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది ఈ భామ. ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో పాడ్ మ్యాన్ చిత్రాన్ని తెరకెక్కించిన ఆర్ బల్కి.. రీసెంట్ గా క్వీన్ కు ఓ కథను వినిపించాడట. కథ ప్రకారం ఇందులో ఒక యాక్సిడెంట్ లో ఎడమవైపు భాగం మొత్తం చచ్చుబడిపోయిన మహిళ పాత్రలో కంగనా రనౌత్ కనిపిస్తుందట.

కంగనా పాత్రకు మెంటార్ గా అమితాబ్ బచ్చన్ నటించనుండడం మరో హైలైట్ గా చెప్పుకోవాలి. కానీ ఈ క్యారెక్టర్ లో చేసేందుకు రెండు నెలల పాటు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయినా సరే ఓకే చెప్పేసిందట కంగనా. ప్రస్తుతం తను నటిస్తున్న మణికర్ణిక మూవీ షూటింగ్ పూర్తి కాగానే.. ఈ కొత్త సినిమా పనులు మొదలుపెట్టనుంది కంగన. ఇక థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ చిత్రంలో నటిస్తున్న బిగ్ బీ.. కంగనా రనౌత్ మూవీకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు