2018 సమ్మర్.. నెవర్ బిఫోర్

2018 సమ్మర్.. నెవర్ బిఫోర్

గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో సంక్రాంతికి మాత్రమే ఎక్కువ సందడి కనిపిస్తోంది. సంక్రాంతి కంటే పెద్ద సీజన్ అయిన వేసవిలో అనుకున్న స్థాయిలో పెద్ద సినిమాలు రిలీజవ్వట్లేదు. ఈ ఏడాది వేసవే తీసుకుంటే.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ మాత్రమే సందడి చేసింది. సమ్మర్‌కే అనుకున్న ‘స్పైడర్’ వాయిదా పడింది. ‘దువ్వాడ జగన్నాథం’ సైతం వేసవి సందడి ముగిశాక రిలీజైంది. వేసవి ఆరంభానికి ముందే ‘కాటమరాయుడు’ హంగామాకు తెరపడింది. అసలు ‘డీజే’ కానీ.. ‘కామటరాయుడు’ కూడా ఆశించిన ఫలితాలు కూడా ఇవ్వలేదు. గత రెండు మూడు సీజన్ల నుంచి వేసవిలో ప్రేక్షకులు ఆశించిన వినోదం అందట్లేదు.

ఐతే వచ్చే ఏడాది మాత్రం సమ్మర్ హీట్ మామూలుగా ఉండేలా లేదు. కనీసం ఐదు భారీ సినిమాలు వేసవిలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ‘బాహుబలి-2’ మాదిరే.. వచ్చే ఏడాది వేసవికి ‘2.0’ హంగామా చూడబోతున్నాం. ఇంకా డేట్ ఖరారవ్వలేదు కానీ.. ఈ చిత్రం ఏప్రిల్లోనే రాబోతోంది. మరోవైపు సమ్మర్ తెలుగు సినిమాల సందడి మార్చి నెలాఖర్లోనే మొదలుకానుంది.

మార్చి 30కి ‘రంగస్థలం’ ఖరారైంది. ఏప్రిల్లో ‘భరత్ అను నేను’.. ‘నా పేరు సూర్య’ విడుదలవుతాయి. ఇంకా అక్కినేని నాగార్జున-రామ్ గోపాల్ వర్మ సినిమా.. విక్టరీ వెంకటేష్-తేజ చిత్రం.. నాగచైతన్య ‘సవ్యసాచి’.. సాయిధరమ్ తేజ్-వి.వి.వినాయక్ చిత్రం.. ఇలా వేసవిని చాలా సినిమాలే టార్గెట్ చేశాయి. మొత్తానికి వచ్చే ఏడాది వేసవికి సినిమాల సందడి ఓ రేంజిలో ఉంటుందని అర్థమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు