త్రిషను అలా తిట్టేశాడేంటి!?

త్రిషను అలా తిట్టేశాడేంటి!?

హీరోయిన్ గా త్రిషకు బోలెడంత గుర్తింపు మాత్రమే కాదు.. మంచి పేరు కూడా ఉంది. షూటింగ్ పూర్తి చేసి తన పని అయిపోయిందని చెప్పేసే టైపు కాదు ఈ హీరోయిన్. పబ్లిసిటీ యాక్టివిటీస్ ను పక్కాగా చేపట్టి.. సినిమాను ఒడ్డుకు చేర్చేందుకు తన వంతు సాయం బాగానే చేస్తుంది. అందుకే 15 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతున్నా.. ఇప్పటికీ ఈమె చేతిలో అరడజన్ సినిమాలకు పైగా ఉన్నాయని చెప్పచ్చు.

అయితే.. రీసెంట్ గా సామీ స్క్వేర్ సినిమా షూటింగ్ నుంచి త్రిష వాకౌట్ చేసింది. క్రియేటివ్ డిఫరెన్సులు అంటూ ఈ చెన్నై భామ కవరింగ్ చేసింది కానీ.. అసలు కారణం ఏంటో తెలియలేదు. చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు.. త్రిష వెర్షన్ షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందట. షూటింగ్ కు త్రిష ఇప్పటికీ సహకరించడం లేదనే టాక్ ఉంది. ఈ విషయం.. ఇప్పుడు తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన కామెంట్స్ తో వెల్లడి అయిపోయింది. అన్నాదురై మూవీ ఫంక్షన్ కు వచ్చిన జ్ఞానవేల్ రాజా.. విజయ్ ఆంటోనీ ఎంతో ప్రొఫెషనల్ అని.. తన ప్రవర్తనతో ఈ స్థాయికి చేరుకున్నాడని పొగిడాడు.

ఆ తర్వాతే అన్ ప్రొఫెషనల్ అంటూ.. త్రిష పేరు ఎత్తకుండానే తిట్టిపోశాడు జ్ఞానవేల్ రాజా. ఓ సినిమా షూటింగ్ నుంచి హీరోయిన్ వాకౌట్ చేస్తే.. చర్చల కోసం ఆమె ఉండే హోటల్ వెళ్లి..  10 గంటల పాటు వెయిట్ చేసినా.. కనీసం మాట్లాడలేదని.. అలాంటి వ్యక్తులు ఉన్న తమిళ సినీ పరిశ్రమలోనే.. విజయ్ ఆంటోనీ లాంటి ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారని అన్నాడు. ఇటు పొగుడుతూనే అటు తిట్ల దండకం అందుకోవడం విశేషం. ఈయన తిట్లు కేవలం త్రిషకు మాత్రమే పరిమతం కాలేదు. ఇన్ డైరెక్ట్ గా హీరో శింబును.. కమెడియన్ వడివేలును కూడా ఓ రేంజ్ లో ఆడేసుకున్నాడు జ్ఞానవేల్ రాజా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు