బిచ్చగాడు చెప్పిందే.. అమలా పాల్ చేసిందా?

బిచ్చగాడు చెప్పిందే.. అమలా పాల్ చేసిందా?

లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం ఇప్పుడున్న ట్రెండ్ లో జనాలకు ఓ క్రేజ్ గా మారింది. ఎప్పటినుంచో ఈ ట్రెండ్ ఉన్నా.. ఈ మధ్య కాలంలో బాగా ఊపందుకుందని చెప్పవచ్చు. అయితే.. లక్షలు.. కోట్లు పోసి కార్లను కొనుగోలు చేసేందుకు సెలబ్రిటీలకు పెద్దగా సమస్య అనిపించదు. పైగా ఇదో స్టేటస్ సింబల్ కూడా. కానీ దాని రిజిస్ట్రేషన్ దగ్గరకు వచ్చేసరికి పన్ను కట్టేటపుడే వీరికి పొదుపులు గుర్తుకువస్తాయి.

తాజాగా ఫహద్ ఫాజిల్.. హీరోయిన్ అమలా పాల్ ఇలాంటి విషయంలోనే దొరికిపోయారు. ఓ ఛానల్ చేసిన ఇన్వెస్టిగేషన్ లో వీరిద్దరూ దొంగ అడ్రస్ లతో కార్లు కొనుగోలు చేసిన విషయం వెల్లడైంది. వీళ్లు ఎక్కువగా చెన్నైలోనే ఉంటారనే సంగతి తెలిసిందే. కానీ వీరి కార్లు మాత్రం పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ తో ఉన్నాయి. స్టేట్ క్యాపిటల్ అయిన చెన్నై కంటే.. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చెరిలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పన్ను తక్కువ కట్టాల్సి ఉంటుంది. అందుకే ఇలాంటివాటికి పాల్పడుతూ ఉంటారు.

నిజానికి ఈ స్కీమ్ ను మనం ఇప్పటికే బిచ్చగాడు మూవీలో చూశాం. అందులో ఓ సీన్ లో ఓ లగ్జరీ కార్ నడుపుతున్న వ్యక్తి.. రోడ్డుపై హంగామా చేస్తుంటే.. హీరో విజయ్ యాంటోనీ వచ్చి అతడి గాలి తీసేసి.. హీరోయిన్ ను సేవ్ చేస్తాడు. అప్పుడు బిచ్చగాడు మూవీలో ఏం చెప్పాడో.. ఇప్పుడు అమలా పాల్ విషయంలో అదే జరిగింది. దొంగ అడ్రస్ లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వీరి వ్యవహారం ఇప్పుడు కేరళనాట హాట్ టాపిక్ గా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు