రామ్‌ చరణ్‌ రంగస్థలంలో రచ్చ షురూ

రామ్‌ చరణ్‌ రంగస్థలంలో రచ్చ షురూ

చరణ్‌తో సుకుమార్‌ చేస్తోన్న రంగస్థలం 1985 ఆర్ట్‌ సినిమాయేమో అనే భయం అభిమానుల్లో వుంది. చరణ్‌ గడ్డం లుక్‌, చెవిటివాడి పాత్రనే అనే రూమర్స్‌తో ఈ చిత్రం ఏదో ప్రయోగాత్మకం అని అనుకుంటున్నారు. కానీ ఇది పక్కా కమర్షియల్‌ సినిమా అంటూ చరణ్‌ చెబుతున్నాడు.

ఈ చిత్రంలో వినోదం చాలా ఎక్కువ వుంటుందని, సుకుమార్‌ తరహాలోనే వుంటూ కమర్షియల్‌ విలువలు కూడా అన్నీ వుంటాయని అతను తెలిపాడు. తాజాగా ఇందులో ఒక అద్దిరిపోయే ఐటెమ్‌ సాంగ్‌ వుంటుందని ప్రకటించారు. డిజెలో మెరిసిన పూజ హెగ్డే ఈ పాటలో చేస్తుందట.

సుకుమార్‌ సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అ అంటే అమలాపురం, రింగ రింగా లాంటి ఎవర్‌గ్రీన్‌ ఐటెమ్‌ సాంగ్స్‌ అతని సినిమాల్లోనే వున్నాయి. ఈ లెక్కన ఇందులోని పూజ పాట ఎలాగుంటుందనేది ఫాన్స్‌కి వెర్రెక్కించే ఐటెమే.

పూజ హెగ్డేకి ఇప్పుడున్న డిమాండ్‌ ప్రకారం ఈ పాటకి ఆమెకి భారీ పారితోషికాన్నే ఆఫర్‌ చేసి వుండాలి. ఇక తెరపై పూజ చేసే రచ్చ ఎలా వుంటుందో, ఆమె తాకిడికి రంగస్థంలం ఎంతగా షేక్‌ అయిపోతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు