సంపూర్ణేష్‌కి బిగ్‌బాస్‌ ఎదురు వాయింపు?

సంపూర్ణేష్‌కి బిగ్‌బాస్‌ ఎదురు వాయింపు?

బిగ్‌బాస్‌ షోని సక్సెస్‌ చేస్తారనే నమ్మకంతో కొందరిని ఏరికోరి తీసుకున్నారు. వారిలో సంపూర్ణేష్‌ ప్రథముడు. ఆడియన్స్‌ని ఆకర్షిస్తాడని, చివరి వరకు ఈ షోని నడిపిస్తాడని బిగ్‌బాస్‌ ఇతడిని ఎంచుకుంది. పద్నాలుగు మంది పార్టిసిపెంట్స్‌లో సంపూనే హయ్యస్ట్‌ పెయిడ్‌ అని కూడా వార్తలొచ్చాయి. రోజుకి లక్ష రూపాయల చొప్పున డెబ్బయ్‌ రోజులు వుండేట్టు అయితే డెబ్బయ్‌ లక్షలు ఇస్తామని అతనితో ఒప్పందం జరిగిందట.

సినిమాల్లోకన్నా ఎక్కువ సంపాదించవచ్చునని ఆశ పడి వచ్చిన సంపూర్ణేష్‌ బాబు ఈ షో గురించి కనీస అవగాహన లేకుండా వచ్చాడనేది అర్థమైంది. తొలి ఎలిమినేషన్స్‌ నుంచి కాపాడడం కోసం బిగ్‌బాస్‌ అతడిని కెప్టెన్‌గా కూడా నియమించింది. అయితే 'మంచి' అనిపించుకోవడం కోసం కెప్టెన్‌ బాధ్యతలు సరిగా నిర్వర్తించలేక పోయిన సంపూ పది రోజులు తిరగకుండా షోనుంచి పారిపోయాడు.

ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం వల్లే బిగ్‌బాస్‌ అతడిని పంపించేసిందని బలంగా వినిపిస్తోంది. అయితే కాంట్రాక్ట్‌ సైన్‌ చేసినపుడే మధ్యలో వెళ్లిపోతే లీగల్‌ చర్యలుంటాయని కండిషన్‌ వుండడంతో ఇప్పుడు ఆ భారం సంపూపై పడుతోంది. ఇరవై లక్షల నష్ట పరిహారం చెల్లించాలని బిగ్‌బాస్‌ అతడికి నోటీసులు ఇచ్చినట్టు వదంతులు వినిపిస్తున్నాయి.

ఈ షో నుంచి అతనికి పది లక్షలు వస్తే, ఎదురు మరో పది లక్షలు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందట. మున్ముందు రాబోయే కంటెస్టెంట్స్‌ ఈ విధంగా మధ్యలో పలాయనం చిత్తగించకుండా స్ట్రిక్ట్‌ మెసేజ్‌ పంపించడం కోసం సంపూ విషయంలో కఠినంగా వ్యవహరించాలని బిగ్‌బాస్‌ నిర్వాహకులు నిర్ణయించుకున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు