త్రివిక్రమ్.. కొరటాల ను ఫోలో అయిపోతున్నాడు

త్రివిక్రమ్.. కొరటాల ను ఫోలో అయిపోతున్నాడు

దర్శకుడు కావాలంటే ఒకప్పుడు ముందు దర్శకత్వ విభాగంలో చేరడం.. అసిస్టెంట్ డైరెక్టర్.. అసోసియేట్ డైరెక్టర్.. కో డైరెక్టర్.. ఇలా రకరకాల బాధ్యతల్లో పని చేయడం.. ఇలా సుదీర్ఘ కాలం డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో పని చేశాక ఆపై దర్శకుడిగా అవకాశం దక్కించుకోవడం.. ఇలా ఉండేది వ్యవహారం. కానీ గత కొన్నేళ్లలో కథ మారింది. దర్శకుడు కావడానికి దర్శకత్వ విభాగంలో పని చేయడాన్ని దగ్గర దారిగా ఇప్పుడెవరూ భావించట్లేదు. ముందు రచయితగా పని చేయాలి. కొంచెం అనుభవం.. పేరు సంపాదించాలి. ఆపై మెగా ఫోన్ పట్టేయాలి. ఇదే చాలామంది అనుసరిస్తున్న ట్రెండు. గత దశాబ్ద కాలంలో ఎంతమంది రచయితలు దర్శకులుగా మారారో లెక్కల్లో చెప్పడం కష్టం.

త్రివిక్రమ్.. కొరటాల శివ లాంటి స్టార్ డైరెక్టర్లు ముందు రచయితలన్న సంగతి తెలిసిందే. వారి కోవలోనే ఇంకా చాలామంది రచయితలు దర్శకులయ్యారు. ఇప్పుడు స్టార్ రైటర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీధర్ సీపాన కూడా మెగా ఫోన్ పట్టేస్తున్నాడు. పూల రంగడు, లౌక్యం, అహనా పెళ్లంట, పవర్, పోటుగాడు, డిక్టేటర్, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలకు రచయితగా పని చేసిన శ్రీధర్ సీపాన త్వరలోనే దర్శకుడిగా మారుతున్నాడు. రచయితగా ఎక్కువగా పేరున్న హీరోలతో, కమర్షియల్ సినిమాలకు పని చేసిన శ్రీధర్.. దర్శకుడిగా మాత్రం భిన్నమైన దారిలో నడుస్తాడట. అందరూ కొత్త వాళ్లతో లెజెండరీ డైరెక్టర్ జంధ్యాల తరహా కామెడీ మూవీని తెరకెక్కిస్తాడట. ఈ చిత్రానికి ‘బృందావనమది అందరిది’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసేశాడతను. నిర్మాత.. నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని అతను చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు