నాని సినిమా అసలు పాయింట్ ఏంటంటే..

నాని సినిమా అసలు పాయింట్ ఏంటంటే..

కొందరు తమ సినిమా గురించి అన్నీ దాచేసి.. నేరుగా థియేటర్లో సర్ప్రైజ్ చేయాలనుకుంటారు. ఇంకొందరు సినిమా గురించి ముందే చెప్పేసి ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేయాలనుకుంటారు. నాని అండ్ టీం 'నిన్ను కోరి' విషయంలో రెండో దారినే ఎంచుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే దీని కథ ఏంటన్నది ఒక ఐడియా వచ్చేసింది జనాలకు. తాజాగా నాని మరింత వివరంగా ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పే ప్రయత్నం చేశాడు. అసలు 'నిన్ను కోరి'లో ప్రధాన కథాంశం ఏంటి అని నానిని అడిగితే.. అతనేమని సమాధానం ఇచ్చాడంటే..

''జీవితంలో ఏదైనా సమస్య రాగానే లైఫ్‌ అయిపోయింది అనుకుంటూ వుంటాం. ఎవరైనా మంచి చెప్పాలని ప్రయత్నించినా.. లేదు.. నా లైఫ్‌ అయిపోయింది అంటుంటారు. చాలామంది ఏదో తెలియని నెగెటివ్ ఆలోచనల్లోకి వెళ్లిపోవడం చూస్తుంటాం. ఐతే చిన్న సమస్య వల్ల అంతమైపోయే చిన్న జీవితం కాదు మనది. ఒక్కసారి మనం జీవితానికి స్వాగతం చెప్తే జీవితం మనకు ఎన్నో సర్ప్రైజ్‌లు ఇస్తుంది. ఈ విషయమే సినిమాలో చెబుతున్నాం.

'లైఫ్‌ మనకి బోలెడన్ని ఛాన్సులిస్తుంది. మనం లైఫ్‌కి ఒక ఛాన్స్‌ ఇద్దాం' అంటూ సినిమా చివర్లో ఒక లైన్ ఉంటుంది. అదే ఈ సినిమా. చాలా ఎమోషనల్‌గా సాగే సినిమా ఇది. ప్రేక్షకులు త్వరగా ఇందులో ఇన్వాల్స్ అయిపోతారు. నేను కథ పూర్తిగా వినకుండానే ఓకే చెప్పిన సినిమా ఇది. మామూలుగా ఓ దర్శకుడు కథ చెబుతుంటే ఇంటర్వెల్ పాయింట్ ఏంటి అని ఆలోచిస్తుంటాను.

కానీ దీనికి అలా కాకుండా పాత్రల్లో ఇన్వాల్వ్ అయిపోయి కథ విన్నాను. దర్శకుడు నాకు కథ చెబుతున్నపుడు అతడి కళ్లల్లో నీళ్లు కనిపించాయి. బహుశా అతడి ఫ్రెండు జీవితంలో జరిగిన కథేమో ఇది. ప్రేక్షకుల్ని కూడా ఈ సినిమా కదిలిస్తుంది'' అని నాని తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English