శర్వా.. అంతగా భయపడిపోయావా!

శర్వా.. అంతగా భయపడిపోయావా!

హీరోగా అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న టైంలో ‘కో అంటే కోటి’ సినిమాతో నిర్మాతగా మారి అందరినీ ఆశ్చర్యపరిచాడు శర్వానంద్. దర్శకుడు అనీష్ కురువిల్లా కొత్తగా ఏదో ట్రై చేశాడు కానీ అది వర్కవుటవ్వలేదు. ఈ సినిమాపై శర్వా పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం పోయింది. నిర్మాతగా తొలి ప్రయత్నంలో చేదు అనుభవమే ఎదుర్కొన్నాడు శర్వా. ఈ దెబ్బతో ఇక మళ్లీ నిర్మాణం జోలికి వెళ్లలేదతను. భవిష్యత్తులోనూ తాను సినిమాలు నిర్మించాలని అనుకోవట్లేదని చెప్పాడు శర్వా. ప్రొడక్షన్లో లోతుపాతులేంటో తెలుసుకోకుండా నిర్మాతగా మారి తప్పు చేశానని అంటున్నాడు శర్వా.

ఒక సినిమా ఫలితాన్ని అంచనా వేయగలిగే కెపాసిటీ ఉంటేనే సినిమాలు నిర్మించాలని.. డిస్ట్రిబ్యూషన్‌తో పాటు చాలా అంశాలపై అవగాహన ఉండాలని.. చాలా సమయం కూడా కేటాయించాలని.. సినిమా నిర్మాణం అంటే మామూలు విషయం కాదని సెలవిస్తున్నాడు శర్వా. ఇప్పట్లో అయితే తనకు మళ్లీ సినిమాను నిర్మించే ఆలోచనే లేదని శర్వా స్పష్టం చేశాడు. తన చివరి సినిమా ‘శతమానం భవతి’ అంత పెద్ద హిట్టవుతుందని అనుకోలేదని.. ఆ సినిమా అంత విజయం సాధించడానికి కారణం నిర్మాత దిల్ రాజేనని శర్వా తెలిపాడు.

ఆ సినిమా కంటే ముందు ‘రాధ’ మొదలుపెట్టి షూటింగ్ చేస్తుండగా.. సంక్రాంతి సీజన్లో ‘శతమానం భవతి’ రిలీజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని రాజు చెప్పారని.. దీంతో ‘రాధ’ను పక్కనబెట్టి ‘శతమానం భవతి’ పూర్తి చేశానని.. రాజు చెప్పినట్లే ‘శతమానం భవతి’ సంక్రాంతికి రిలీజవడం వల్ల అనుకున్న దాని కంటే పెద్ద సక్సెస్ అయిందని.. నిర్మాత అంటే ఇలా ఉండాలని శర్వా అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు