చాలామంది హీరోలు ఫీలయ్యారు

చాలామంది హీరోలు ఫీలయ్యారు

ఈరోజంతా మన తెలుగు హీరోల్లో చాలామంది కాస్త డల్‌గానే ఉన్నారు. దానికి ఒక రీజన్‌ ఉంది. మనోళ్ళందరికీ అడపాదడపా క్రికెట్‌ ఆడటమన్నా, క్రికెట్‌ గేమ్‌ చూడటమన్నా కాస్త ఇష్టమే. అందుకే మనోళ్లు దేశంలో ఏ మ్యాచ్‌ జరిగినా, ప్రపంచంలో ఏ క్రికెట్‌ వింత చోటుచేసుకున్నా ఒక ట్వీటూ వేస్తూ ఉంటారు.

అయితే మనోళ్లు ఫాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల్లో ఆరెస్టయ్యాడని తెలియగానే గుండె జారిపోయింది. అసలు తాము అభిమానించే క్రికెటర్‌ ఇలా చెయ్యడమేంటని విస్తుపోయారు. పైగా శ్రీశాంత్‌ ఒక ఓవర్లో 20 రన్స్‌ ఇచ్చినందుకు ఏకంగా 60 లక్షలు ఛార్జ్‌ చేస్తున్నాడని తెలియగానే ముందు ఎవ్వరూ నమ్మలేదు. 

కాని నాలుగు నెలల నుండి ట్రాప్‌ వేసి ఆధారాలతో సహా ఈ క్రికెటర్‌ను అరెస్టు చేశారని ఢిల్లీ పోలీస్‌ కమీషనర్‌ చెప్పగానే, ఇతగాడినా మనం అభిమానించింది అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోవడమేంటి, బాగా ఫీలయ్యారు కూడా...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు