నాని పేరు మీద పధ్నాలుగు కోట్లు

నాని పేరు మీద పధ్నాలుగు కోట్లు

'నేను లోకల్‌' చిత్రంతో ముప్పయ్‌ మూడు కోట్ల షేర్‌ సాధించి సత్తా చాటుకున్న నాని చిత్రాలని కొనడానికి ఇప్పుడు బయ్యర్లు ఎగబడుతున్నారు. అతని తాజా చిత్రం 'నిన్ను కోరి' సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులని ఏకమొత్తంగా కొనేసింది ఏషియన్‌ ఫిలింస్‌ సంస్థ.

రెండు రాష్ట్రాల హక్కులకి పధ్నాలుగు కోట్లు ఇచ్చి దీనిని సొంతం చేసుకున్నారు. నాని తప్ప మరో బ్రాండ్‌ నేమ్‌ లేని సినిమాకి ఇది చాలా పెద్ద డీల్‌. ఇంకా ఓవర్సీస్‌, కర్నాటక, తమిళనాడు రైట్స్‌ వుండనే వున్నాయి. అవన్నీ కలుపుకుని ఈజీగా ఇరవై ఒక్క కోట్ల వరకు బిజినెస్‌ అవుతుంది. కేవలం నాని పేరు మీద, అతని కథల ఎంపికపై నమ్మకంతోను ఈ చిత్రం రైట్స్‌ని ఈ రేట్‌కి కొన్నారు.

శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సరైనోడు ఫేమ్‌ ఆది పినిశెట్టి కీలక పాత్ర చేస్తున్నాడు. జెంటిల్‌మేన్‌లో నానికి జంటగా నటించిన నివేదిత థామస్‌ ఇందులో కథానాయికగా నటిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని తన గత చిత్రం ఫలితంతో సంబంధం లేకుండా తన రెగ్యులర్‌ మార్కెట్‌కి అనుగుణంగా బిజినెస్‌ జరిగేలా చూసుకుంటున్నాడు.

నేను లోకల్‌ చిత్రానికి ఇరవై రెండు కోట్ల బిజినెస్‌ జరిగితే, నిన్ను కోరి చిత్రానికి కూడా అంతే స్థాయిలో బిజినెస్‌ చేస్తున్నారు. తన సినిమాలతో భారీ నష్టాల్లాంటివి జరగకుండా నాని ఈ విషయంలో చాలా కేర్‌ తీసుకుంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు